జాతీయ రాజకీయాల్ని టాస్క్‌గా తీసుకున్న కేసీఆర్… అన్ని మార్గాలను పరిశీలించి జాతీయ పార్టీ పెట్టడమమే చివరి ఆప్షన్ అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్లీనరీలోనే ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి కోసం పలు రాష్ట్రాల్లో పర్యటించి అనేక మంది నేతలతో భేటీ అయిన కేసీఆర్‌కు.. సానుకూల ఫలితాలు రాలేదు. దీంతో జాతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ దిశగా ఆయన చాలా రోజుల నుంచే కసరత్తు చేస్తున్నారు. తనను తాను దేశ్ కీ నేతగా ప్రమోట్ చేసుకుంటున్నారు.
టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ ఫ్లెక్సీలను ఉత్తరాదిలోనూ ఏర్పాటు చేశారు. ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నది హైదరాబాద్ నగరంలోనే అయినా ఇతర రాష్ట్రాల్లో పెద్దపెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కేసీఆర్‌ను దేశ్‌కీ నేతగా ప్రమోట్ చేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేయనున్నారు కాబట్టే ఇలా ఆయా రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ పీఆర్వోను కూడా నియమిచుకున్నారు
గతలో కేసీఆర్ నయా భారత్ పేరుతో జాతీయ పార్టీని పెట్టబోతున్నారన్నప్రాచరం జరిగింది. అది పార్టీ తరహాలోనే కొత్త విధానంలో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. కొన్నిపార్టీల కూటమిగా కూడా ఉంటుందని.. అయితే ఒకే గుర్తు మీద పోటీ చేస్తాయని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించనున్నారని ఇప్పటికే ప్రకటించారు. ఎలా చూసినా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఖాయమనే నమ్మకం టీఆర్ఎస్ వర్గాల్లో ఏర్పడుతోంది.