తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు అసెంబ్లీ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ ప్రకటన, రైతు భరోసా కు విధివిధానాలపై ఈ సమావేశాల్లోనే ప్రకటన చేయబోతుంది సర్కార్.
అయితే, ఇప్పటికే అరడజను ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు జైకొట్టారు. మరో ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు. మరో ఆరుగురు కూడా లైన్లో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అసెంబ్లీ మొదలయ్యే ముందే ఎమ్మెల్యేల చేరికలు కూడా పూర్తి చేయాలని, టీఆర్ఎస్ ఎల్పీ విలీనాన్ని కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ ఫిక్స్ అయ్యింది.
ఎమ్మెల్యేల చేరికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కోర్టు కేసు అంటూ హడావిడి చేస్తోంది. కానీ, ఆ బెదిరింపులకు ఎమ్మెల్యేలు ఎవరూ వెనక్కి తగ్గటం లేదు. ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ మారితే మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.
ఇలాంటి సమయంలో కేసీఆర్ సభకు వచ్చే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఉన్నా లేకున్నా కేసీఆర్ సభకు వచ్చి ఉపయోగం లేదన్న భావనలో ఉన్నారని భావిస్తున్నాయి. సభలో బాధ్యత అంతా హరీష్ రావు, కేటీఆర్ పైనే వేయబోతున్నారని స్పష్టం చేస్తున్నాయి.
నిజానికి కేసీఆర్ సభకు వస్తే… అదే సభలో గతంలో తమను ఎంతలా అవమానించారో రుచి చూపించాలన్న కసితో ప్రభుత్వ ఎమ్మెల్యేలున్నారు.