కాలం కలిసినరానప్పుడు అరటిపండు తిన్నా పళ్ళు విరుగుతాయనే నానుడిని పక్కాగా ఫాలో అవుతున్నారు కేసీఆర్. కాలం కలిసిరావడంలేదని..ఇప్పుడేం చేసినా చెల్లుబాటు కాదని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. నేతలు ఎవరూ ఎగిరెగిరి పడవద్దని..ప్రభుత్వం ఎక్కడో చోట తప్పు చేసేవరకు వెయిట్ చేయాలంటూ స్వయంగా కేసీఆరే పార్టీ నేతలకు సూచించారు.
కేసీఆర్ రాజకీయాల్లో చాణుక్యుడు. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసు.ఎన్నికలు అయ్యాక అందుకే కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌజ్ కే పరిమితం అయ్యారు. సమయం.. సందర్భం అనుకూలంగా లేనప్పుడు సర్కార్ పై ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు చేసినా తనలాంటి నేతల విశ్వసనీయత దెబ్బతింటుంది తప్ప ప్రయోజనం ఉండదనేది కేసీఆర్ ఆలోచన. అందుకే సర్కార్ పై వ్యతిరేకత మొదలైతే తప్ప ప్రజా క్షేత్రంలోకి రావొద్దని భీష్మించు కూర్చున్నారు.
అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదం చెలరేగినప్పుడు బీఆర్ఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, కేసీఆర్ స్పందించాలన్న అభిప్రాయం ఆ పార్టీ నేతలే వ్యక్తం చేశారు. కానీ, అది పార్టీకి సంబంధించిన వ్యవహారం కావడంతోనే కేసీఆర్ స్పందించలేదని, కేవలం కేటీఆర్ , హరీష్ రావులను గైడ్ చేశారన్న అభిప్రాయం వినిపించింది.
ఇప్పుడు హైడ్రా విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అయినా సర్కార్ ముందుకు వెళ్లే ఆలోచనతోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. అదే తమకు తిరుగులేని అస్త్రం అని భావిస్తోంది. ఈ విషయంలో సర్కార్ ముందుకు వెళ్తే దానిని క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్దంగా ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఆ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అందుకే కేటీఆర్..హైడ్రా బాధితులు వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసుకొని ఓ సమూహంగా మారాలని, రోడ్లెక్కి సర్కార్ కు ఊపిరిరాకుండా చేయాలన్నారు. ఇదే జరిగితే సర్కార్ పై ఒక్కసారిగా వ్యతిరేకత బ్లాస్ట్ అవుతుంది.
అదే సమయంలో కేసీఆర్ బయటకు వస్తే సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని..పైగా గ్రేటర్ ఎన్నికల ముంగిట ఈ పరిణామం పార్టీకి కలిసి రావడంతోపాటు సర్కార్ కు చావుకబురు అవుతుందన్న వ్యూహంతోనే బీఆర్ఎస్ దళపతి మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.