తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… గజ్వేల్‌లో ఓడిపోబోతున్నారా..? అవుననే అంటున్నారు లగడపాటి రాజగోపాల్. తన సర్వే నివేదిక కాకపోయినా… తన అంచనాగా.. ఆయన ఫలితాన్ని విశ్లేషించారు. అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన తాను గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్లానని.. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేశానన్నారు. గజ్వేల్ నియోజకవవర్గంలో… తన వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులతో మాట్లాడినప్పుడు.. ఎవరూ కూడా టీఆర్ఎస్ గెలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేయలేదని.. ఏడుగురు కానిస్టేబుళ్లు టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పారన్నారు. అంటే.. కేసీఆర్ అక్కడ వెనుకంజలో ఉన్నట్లేనన్నారు.
గజ్వేల్‌లో కేసీఆర్‌కు ధీటైన ప్రత్యర్థి ఉన్నారు. వంటేరు ప్రతాప్ రెడ్డి అక్కడి ప్రజలకు చిరపరిచితమైన పేరు. ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు. గత ఎన్నికల్లో కేసీఆర్ 19వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 30వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు… ప్రతాప్ రెడ్డి.. కాంగ్రెస్ తరపునే పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన గెలుస్తారని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. గట్టి పోటీ ఇస్తున్నామని మాత్రం చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి… టీఆర్ఎస్ నుంచి.. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. పరిస్థితి మారిపోయిందనే అంచనాలు ఉన్నాయి. కానీ సర్వే ఫలితాన్ని ఎవరూ వ్యతిరేకంగా చెప్పడం లేదు.
గజ్వేల్‌లో కేసీఆర్‌కు షాక్ తగిలే సూచనలు ఉన్నాయి.. మొదటి సారి లగడపాటి హింట్ ఇచ్చారు. దాన్ని తోసి పుచ్చే పరిస్థితులు మాత్రం లేవని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో ప్రతాప్ రెడ్డిపై.. పోలీసులు చేసిన దౌర్యాన్యాలకు ఆయనపై సింపతీ పెరిగిందనే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ నాలుగున్నరేళ్ల కాలంలో… నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫామ్‌హౌస్‌కు రావడం తప్ప.. ఎప్పుడూ గజ్వేల్‌ను పట్టించుకోలేదు. అందుబాటులో ఉన్న నాయకుడు కావడంతో.. ప్రతాప్ రెడ్డి వైపు ప్రజలు మొగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి రిజల్ట్ కి మాత్రం మరో ఆరు రోజుల గడువు ఉంది.