తెలంగాణలో విద్యుత్ సమస్యలకు చెక్ పెడుతున్నాం… ఎక్కడ కరెంటు ఉంటే అక్కడ కొంటున్నాం అంటూ కేసీఆర్ సర్కార్ గొప్పులు చెప్పుకుంది. కానీ, అక్కడే ఎమర్జెన్సీ పేరుతో అవినీతి చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించింది.
అంత ఎక్కువ రేటు పెట్టి విద్యుత్ ఎందుకు కొనాల్సి వచ్చింది, పీపీఏల్లో ఉన్న లొసుగులపై కమిషన్ విచారిస్తోంది. ఇందులో భాగంగా ఆనాడు ప్రభుత్వ పెద్దల సూచనతోనే ఇది జరిగిందన్న సమాధానాల నేపథ్యంలో, కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపింది. అయితే, సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30వరకు సమయం కోరగా… కమిషన్ కుదరదు అని తేల్చి చెప్పటంతో పాటు జూన్ 15వరకే సమయం అని స్పష్టం చేసింది.
అంటే ఈరోజుతో కమిషన్ ఇచ్చిన గడువు ముగిసినట్లే. కేసీఆర్ ఇంతవరకు రాతపూర్వకంగా సమాధానం పంపలేదని తెలుస్తోంది. కేసీఆర్ సమాధానంను బట్టి నేరుగా విచారించాలా… అవసరం లేదా అనేది నిర్ణయిస్తామని జస్టిస్ నర్సింహరెడ్డి గతంలో చెప్పారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ సమాధానం ఎలా ఉంటుంది…? ఇన్ టైంలో సమాధానం ఇవ్వకపోతే కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది…? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు సాయంత్రం వరకు కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో… కేసీఆర్ ఎం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.