ఢిల్లీ బయట పంజాబ్ లో విజయం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ స్థాయి గుర్తింపు కోసం తొమ్మిది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అందులో తెలంగాణ ఒకటి. స్వయంగా కేజ్రీవాల్ పాదయాత్రకు వస్తారని చెబుతున్నారు. ఆప్ తెలంగామ ఇంచార్జ్‌గా సోమనాథ్ భారతిని నియమించారు. ఆయన హైదరాబాద్‌కు వచ్చి కార్యాచరణ కూడా ప్రారంభించేశారు. అయితే తెలంగాణ ఉద్యమ నేపధ్యం ఉంది కాబట్టి.. అలాంటి ఓ ఫేస్ తమ పార్టీకి ఉండాలని కోరుకుంటోంది. ఆ ఫేస్ ఎవరన్నదానిపై పరిశోధన చేసి కోదండరాంను ఫైనల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎంపీలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పలు జేఏసీల బాధ్యులు, పలువురు ఎన్నారైలు, ప్రముఖులు, స్టూడెంట్ లీడర్స్, కార్మిక నేతలు, సింగరేణి ప్రాంత వాసులు ఇప్పటికే కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టీజేఎస్‌ను ఆప్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనను స్వయంగా కేజ్రీవాల్ .. కోదండరాంకు పంపినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ జనసమితి ముఖ్య నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అవ్వాలంటే ఉద్యమకారులందరూ మూకుమ్మడిగా ఆప్‌లో చేరాలి. ఉద్యమకారులు ఇప్పటికే తెలంగాణ సర్కార్‌పై అసంతృప్తిలో ఉన్నారు. అన్నీ సెక్షన్ల ప్రజలు పోరాడినా రాష్ట్రం కొందరి తెలంగాణగానే మారిందని చెబుతున్నారు. ఈ క్రమంలో టీజేఎస్ విలీనం అయితే.. నిజంగానే ఉద్యమకారుల మద్దతు లభించే అవకాశం ఉంది. కానీ అది జరుగుతుందా..అనేది సందేహమే.ఎందుకంటే ఆప్ ను దక్షిణాదిలో ఎవరూ తమ పార్టీగా గుర్తించే పరిస్థితి లేదు.