మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తానని తనతో రావాలని రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట కేటీఆర్, హరీష్ రావు, ఈటలకు సవాల్ చేశారు.
దానికి హరీష్ రావు స్పందించారు. పాదయాత్రకు తాము రెడీ అని టేటు, టైము ఫిక్సి చేయాలన్నారు. ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా మూసి పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
ఎనిమిదో తేదీన రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఆ రోజు యాదాద్రి ఆలయంలో పూజలు చేసి అదే రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. భువనగిరి నుంచి వలిగొండ వైపు పాదయాత్ర చేయనున్నారు. ఏర్పాట్ల కోసం నల్లగొండ నేతలు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పైపులైన్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని రైతులు, ప్రజలను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు.
మూసీ ప్రాజెక్టు రాజకీయంగా కీలకంగా మారుతోంది. దాన్ని ప్రజుల కోరుకుంటున్నారని కాంగ్రెస్ … కోరుకోవడం లేదని బీఆర్ఎస్ వాదిస్తున్నారు. అందుకే ఈ పాదయాత్ర సవాళ్లు వచ్చాయి. గతంలో అంగీకరించినట్లుగా పాదయాత్రలో పాల్గొనాలని హరీష్, కేటీఆర్‌లకు కాంగ్రెస్ ఆహ్వానాలు పంపుతుందా.. పంపితే వారు వస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని అనుకోవచ్చు.