బీఆర్ఎస్ సర్కార్ లో హెచ్ఎండీఏలో అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించిన అధికారి శివబాలకృష్ణ వ్యవహారం .. తెలంగాణలో కలకలం రేపుతోంది. ఆయన చాలా మంది ప్రముఖ నేతలకు బినామీగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అరెస్టుతో ఒక్కొక్కటి బయటకు వస్తోంది. ధరణిని అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలు చేశారని.. భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకోవడం.. రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా చేయడం వంటివి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున భూమి ఉన్నట్లుగా బయటపడింది. ఎకరామో రెండేకరాలో కాదు.. ఏకంగా 25 ఎకరాలు ఉంది. యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకర భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ రూ.75 కోట్లు. అయితే ఈ భూమి సోమేష్ కుమార్‌కు ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వార కొనలేదు. సాదాబైనామా ద్వారా భూమి కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదు. ఈ స్కామ్‌ను తవ్వితే మొత్తం బయటకు వస్తాయని అంటున్నారు.
లంచాలు, భూములతో అక్రమ సందించిన రెరా సెక్రెటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో సోమేష్ కుమార్ ఛైర్మన్‌గా ఉన్నారు. అప్పుడే యాచారంలో 25 ఎకరాలు సోమేష్ భార్య పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. ఈ భూమికి సంబంధి ఆధారాలను ఏసీబీ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేసినట్లు సోమేష్ కుమార్ చెబతున్నారు. తనకున్న ఇళ్లు అమ్మి స్థలం కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. కానీ ఎవరూ నమ్మడం లేదు.
అయితే గతంలో జరిగిన భూ లావాదేవీలు.. ఇతర అంశాలపై సమగ్ర సమాచారం ఉన్న కాంగ్రెస్ పెద్దలు కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తున్నారని అంటున్నారు. ఈ కేసు త్వరలో కేటీఆర్ వద్దకు చేరుతుందని అంటున్నారు. కేటీఆర్ కు తెలియకుండా హెచ్ఎండీలో ఎలాంటి అనుమతుల రావడం.. ఫైల్స్ కదలడం వంటివి జరిగేవి కాదని అంటున్నారు. మొత్తంగా శివబాలకృష్ణ కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే చాన్స్ కనిపిస్తోంది.