మేడిగడ్డకు తామ కూడా వెళ్తామని కేసీఆర్ నల్లగొండ సభలో ప్రకటించారు. ఆయన మాటలకు తగ్గట్లుగా కేసీఆర్ షెడ్యూల్ రూపొందించారు. మేడిగడ్డకు వెళ్తాం.. తాము కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెబుతామని ప్రకటించారు. మేడిగడ్డలో రెండు,మూడు పియర్స్ మాత్రమే పగుళ్లు వచ్చాయన్నారు. కేటీఆర్ వ్యూహం ఏమిటో కానీ.. బీఆర్ఎస్ నేతలకు కూడా మేడిగడ్డ అంశాన్ని లైవ్లో ఉంచి సాధించుకునేదేమిటన్న సందేహం వ్యక్తమవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదనేది కేటీఆర్ వాదన. ఈ విషయం పై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నారు. కానీ కాళేశ్వరంకు ఆయువుపట్టు .. మేడిగడ్డ, అన్నారం రిజర్వాయర్లు. మేడిగడ్డ పగుళ్లు వచ్చాయి. అన్నారంలోనూ లోపాలున్నాయని రిపోర్టు తేల్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు ప్రాజెక్టుల్లో లోపాలున్నాయని నివేదికలు బయట పెట్టాయి. అలాగే పెద్ద ఎత్తున అవినీతి అంశం చర్చకు వస్తోంది.
ఇక ఈ ప్రాజెక్టు నిరర్థకం అని.. పెట్టిన ఖర్చుకు తగ్గ ఆదాయం రానే రాదని.. రాష్ట్రం మొత్తానికి సరిపోయేంత కరెంట్ ఉపయోగించినా ప్రయోజనం ఉండదని తేల్చేసింది. కాగ్ . ప్రాజెక్ట అంచనాల లెక్కలపైనా కీలక విషయాలను బయట పెట్టింది. ఎలా చూసినా కళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లో చర్చ పెట్టుకోవడం అంత తెలివి తక్కవ రాజకీయం ఉండదన్న వాదన సహజంగానే రాజకీయవర్గాల్లో ఉంది. అయితే కేటీఆర్ అదే కాళేశ్వరం తమకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ.. మేడిగడ్డ కుంగుబాటు జరగకపోతే ఆయన ప్రయత్నాల్లో కాస్త ఫలితం కనిపించేదమో కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది.
మార్చి ఒకటో తేదీన మరోసారి కాళేశ్వరం వ్యవహారంలో అవకతవకలు.. మేడిగడ్డ కుంగుబాటు.. అవినీతి.. అన్నీ మరోసారి చర్చకు రానున్నాయి.