కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టేకోవర్ చేస్తున్నారా?

కవిత ఉద్యమాన్ని కేటీఆర్ టెకోవర్ చేయబోతున్నారా? అరెస్టుకు ముందు క‌విత భుజానికెత్తుకున్న ఉద్య‌మాన్ని ఇక కేటీఆర్ న‌డ‌ప‌బోతున్నారా…? క‌వితను రాజ‌కీయంగా సైలెంట్ చేసే అవ‌కాశం ఉందా…?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక సర్కార్ పై పోరాడేందుకు ఎలాంటి అస్త్రం లేకుండా పోయింది. పార్టీ నేత‌లంతా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర‌కే ఆగిపోతే… ఎమ్మెల్సీ క‌విత మాత్రం పార్టీ త‌ర‌ఫున కాకుండా, జాగృతి సంస్థ త‌ర‌ఫున బీసీ ఉద్యమాన్ని కవిత ఎత్తుకున్న సంగతి తెలిసిందే. దశల వారీగా ఉద్యమ కార్యక్రమాలు చేపడుతోన్న సమయంలోనే లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అయ్యారు. అప్ప‌టికే పూలే విగ్ర‌హాన్ని అసెంబ్లీలో పెట్టాల‌ని ఉమ్మ‌డి జిల్లాల వ్యాప్తంగా రౌండ్ టేబుల్ స‌మావేశాలు నిర్వ‌హించ‌టం, బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపు అంశాన్ని లెవ‌నెత్తుతూ వ‌చ్చారు. క‌విత అరెస్ట్ త‌ర్వాత ఆ ఉద్య‌మం చేస్తున్న వారికి ఆర్థికంగా, రాజకీయంగా బీఆర్ఎస్ తరఫున ఎలాంటి మద్దతు లేకుండా పోయింది.

కానీ, తాజాగా కొంద‌రు బీసీ నేత‌లు కేటీఆర్ ను క‌ల‌వ‌టం… ఆయన వెంట‌నే బీసీల కోసం పోరాటానికి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్ల‌రేష‌న్ అమ‌లు దిశ‌గా కార్యాచచ‌ర‌ణ ప్ర‌క‌టించారు.

నవంబర్ 10లోపు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని , లేదంటే తర్వాత సర్కార్ పై పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతామని కేటీఆర్ హెచ్చరించారు. అంటే…కవిత ఉద్యమాన్ని ఇక బీఆర్ఎస్ ముందుకు తీసుకెళ్తుందని కేటీఆర్ పరోక్షంగా చెప్పేశారు. అయితే ఇక్కడ పలువురికి అనుమానాలు తలెత్తుతున్నాయి. కవిత ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఎత్తుకోబోతుంది అంటే కొద్ది కాలం వరకు ఆమె రాజకీయాలకు దూరం ఉండనున్నారా? అనే అనుమానాలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close