పోలీసు కేసు విషయంలో రాజీ పడకూడదని మంచు మనోజ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. తనపై దాడి జరిగిదంని పదునైన ఆయుధాలతో దాడి చేశారన్న మెడికల్ ఫ్రూవ్స్ కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఇదే విషయాన్ని గుర్తించి మెడికో లీగల్ కేసుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సోమవారం ఆయన ఇంటికి వెళ్లి స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నారు.
మెడికో లీగల్ కేసు అయితే మొదట పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆ ప్రకారం మనోజ్‌పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యం .. బలమైన దెబ్బలు తగిలాయని.. దాడి చేసినట్లుగా ఉందని రిపోర్టు ఇచ్చింది. దీంతో మంచు మోహన్ బాబు, ఆయన అనుచరుడు వినయ్‌లకు గడ్డు పరిస్థితి ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.
మనోజ్ ఈ అంశంపై మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ… తనపై తండ్రి చేసిన, చేయించిన దాడి ఘటనతో ఆయన మానసికంగా కలత చెందారని తాడో పేడో తేల్చుకోవాలని డిసైడయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. తండ్రే తనపై దాడి చేశారని 100కు కాల్ చేసినప్పుడు. పోలీసులకు చెప్పారు. తర్వాత కేసు నమోదు విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లి మెడికో లీగల్ కేసుగా మార్చడం ద్వారా తన ఆలోచనల్లో మార్పు లేదని.. కేసు విషయంలో మోహన్ బాబును అయినా వదిలేది లేదని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.