బ‌తుక‌మ్మ‌తో క‌విత రీ ఎంట్రీ ఇస్తారా…?

తెలంగాణ సంస్కృతికి అద్దంప‌ట్టే బతుకమ్మ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బ‌తుక‌మ్మ పండుగ మొద‌ల‌వుతుందంటే చాలు ఉద్య‌మ స‌మ‌యం నుండి ఎమ్మెల్సీ క‌విత హాడావిడి మొద‌లుపెడ‌తారు. ప్ర‌తిసారి తెలంగాణ‌వ్యాప్తంగా జాగృతి త‌ర‌పున ఉత్స‌వాలు చేస్తుంటారు. అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌భుత్వం ప్ర‌త్యేక నిధులు కూడా జారీ చేసేది.

లిక్క‌ర్ కేసులో అరెస్ట్ అయిన క‌విత ఇటీవ‌లే బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ఓ 10రోజులు రెస్ట్ తీసుకున్న త‌ర్వాత వ‌స్తార‌ని మొద‌ట క‌విత టీం ప్ర‌క‌టించింది. కానీ, ఆ త‌ర్వాత ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఎమ్మెల్సీగా ఉన్నా క‌విత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారా… బ్రేక్ త‌ర్వాత వ‌స్తారా అన్న‌ది స్ప‌ష్ట‌త లేదు.

కానీ బీఆర్ఎస్ ఓడిపోయాక వ‌స్తున్న మొద‌టి బ‌తుక‌మ్మ పండ‌గ ఇది. గ‌తంలో బ‌తుక‌మ్మ పండుగ అంటే క‌విత‌, క‌విత అంటే బతుక‌మ్మ పండుగ అన్నంత ప్ర‌చారం చేసుకున్నారు. మ‌రి ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా…? పార్టీ త‌ర‌ఫున లేదా జాగృతి త‌ర‌ఫున క‌విత ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారా…? అన్న చ‌ర్చ ప్రారంభం అయ్యింది.

క‌విత బ‌తుక‌మ్మ పండుగను నిర్వ‌హిస్తే… కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీల నుండి లిక్క‌ర్ స్కాంకు ముడిపెట్టి విమ‌ర్శ‌లు రావ‌టం ప‌క్కా. ఇందుకు క‌విత వెనుక‌డుగు వేస్తారా? లేదా ఈ సంవ‌త్స‌రం దూరంగా ఉంటారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయంగా ఉండాల‌నుకుంటే నిర్వ‌హిస్తారు లేదంటే దూరంగా ఉండిపోతార‌న్న అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సందీప్ సినిమాకు భ‌లే రేటు

సందీప్ కిష‌న్ - త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి 'మ‌జాకా' అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ధారి. 2025 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం… ఘాటుగా స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం విచారకరమని పేర్కొన్న...

బ‌తుక‌మ్మ‌తో క‌విత రీ ఎంట్రీ ఇస్తారా…?

తెలంగాణ సంస్కృతికి అద్దంప‌ట్టే బతుకమ్మ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బ‌తుక‌మ్మ పండుగ మొద‌ల‌వుతుందంటే చాలు ఉద్య‌మ స‌మ‌యం నుండి ఎమ్మెల్సీ క‌విత హాడావిడి మొద‌లుపెడ‌తారు. ప్ర‌తిసారి తెలంగాణ‌వ్యాప్తంగా జాగృతి...

తిరుప‌తి ల‌డ్డూ వివాదం …జ‌గ‌న్ స్పందించ‌క తప్ప‌టం లేదు

తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదం అంటే క‌ళ్ల‌కు అద్దుకొని తింటారు. వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే ఎంత భాగ్య‌మో... ప్ర‌సాదాన్ని కూడా అంతే గౌర‌వంగా చూస్తారు. అలాంటి ల‌డ్డూ ప్ర‌సాదంలో వాడిన నెయ్యిలో జంతువుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close