ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదు. కానీ ఆ పార్టీ చాలా కీలకం అయిపోయింది. ఆ పార్టీ ఎటు వైపు ఉంటే ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయిపోయింది. అటో ఇటో మొగ్గాల్సిన పని లేదని.. న్యూట్రల్ గా ఉంటే చాలని టీడీపీ అనుకుంటోంది. ఇదంతా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్లే. ఇప్పటికీ ఏపీలో వారికి ఎలాంటి ఆశలు లేవు.
మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ప్రచారం చేసుకోవడానికి నడ్డా, అమిత్ షా చెరో బహిరంగసభను ఏపీలో ప్లాన్ చేసుకున్నారు. ఒకరు శనివారం.. మరొకరు ఆదివారం తిరుపతి, విశాఖలకు వస్తున్నారు. బహిరంగసభల్లో ప్రసంగిస్తారు. ఇప్పుడు వీరు ఏం ప్రసంగిస్తారు.. అనేదానిపై ఏపీలో వారి రాజకీయ పయనంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు నేతల బహిరంగసభలపై ఈ సారి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తమ పార్టీ నేతలకు వారు రోడ్ మ్యాప్ ఇస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఢిల్లీ పెద్దలు ఏపీ రాజకీయాల విషయంలో ఏం చేస్తున్నారో రాష్ట్ర నేతలకు అసలు సమాచారం లేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలుస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఏపీ బీజేపీ నేతలు పడిపోయారు. ఇలా భేటీలు జరిగాయి.. కదా పొత్తులుంటాయా అని అడుగుతున్న వారికి ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. తమకు సమాచారం లేదని వారు వాపోతున్నారు.
ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లాలా అన్నది అమిత్ షా, నడ్డాలు ఈ మేరకు వారికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించకుడా కేంద్ర ప్రభుత్వ పాలనా విజయాల గురించి ప్రచారం చేసుకుని వెళ్లిపోతే… హైకమాండ్ కే గందరగోళం ఉందన్న అభిప్రాయం బలపడుతుంది.