బాలకృష్ణ Vs ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్… ఎప్పుడూ ఏదో ఓ కొత్త కారణం వెదుక్కొంటూ ఉంటుంది. తాజాగా అన్‌స్టాపబుల్ లో ‘జై లవకుశ’ ప్రస్తావన వచ్చిందని, అయితే దాన్ని ఎడిట్ చేసి ‘లవకుశ’ మాట లేకుండానే ఎపిసోడ్ ని టెలీకాస్ట్ చేశారని ఓ వార్త బయటకు వచ్చింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు సహజంగానే హర్టయ్యారు. బాబీ తీసిన సినిమాల్లో `జై లవకుశ` మంచి హిట్. అలాంటి సినిమాని బాబీ దగ్గర ప్రస్తావించకుండా, మిగిలిన సినిమాల పేర్లు, పోస్టర్లు వరుస పెట్టి స్క్రీన్ పై చూపించడం విషయంలో ఎన్టీఆర్ అభిమానులు ముందు నుంచీ కినుకగానే ఉన్నారు. అయితే ప్రస్తావన వచ్చినా, దాన్ని ఎడిట్ చేశారన్న గాసిప్ వినిపించడంతో ఇంకాస్త ఇబ్బందిపడ్డారు.దాంతో `డాకూ మహారాజ్`ని ట్రోల్ చేయడం మొదలెట్టారు.
దీనిపై తెలుగు 360 నిర్మాత నాగవంశీని క్లారిటీ అడిగింది. ఎందుకంటే ఆ ఎపిసోడ్ లో బాబీతో పాటు నాగవంశీ కూడా ఉన్నారు. నాగవంశీ ఈ విషయంలో ఓ స్పష్టత ఇచ్చారు. అసలు జైలవకుశ ప్రస్తావనే రాలేదని, దాన్ని ఎడిట్ చేశారనడం ఉత్తిమాట అని తేల్చేశారు. అంతే కాదు.. షార్ట్ గ్యాప్‌లో ఎన్టీఆర్ గురించి ఓ మాట అన్నారని, ఓ సినిమాలో ఎన్టీఆర్ ఆ రోల్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారని చెప్పుకొచ్చారు నాగవంశీ. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది నాగవంశీ ఈ ఇష్యూని భలే కవర్ చేశాడంటూ కామెంట్లు పాస్ చేస్తుంటే, ఇకనైనా అసలు నిజాలు తెలుసుకోండి అంటూ బాలయ్య ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.
ఇటీవల ముంబై ఇంటర్వ్యూలో బోనీ కపూర్‌తో ఇష్యూ గురించి కూడా తెలుగు 360 ఇంటర్వ్యూలో మనసు విప్పారు నాగ వంశీ. ఓ తెలుగు సినిమా వాడిగా, తెలుగు సినిమా గొప్పదనాన్ని చెప్పాలనుకొన్నానని, దాన్ని అందరూ యారగెంట్ అనుకొంటున్నారని, నిజానికి తనకు బాలీవుడ్ సినిమాలంటే ఇష్టమని కరణ్ జోహార్ సినిమాలు చూసి ‘ఇంత గ్రాండియర్‌గా సినిమాలు తీయగలనా’ అనుకొన్నానని, ఆ ఇంటర్వ్యూ తరవాత బోనీ కపూర్ తాను చాలా సేపు మాట్లాడుకొమని, తమ మధ్య ఎలాంటి గొడవా లేదని స్పష్టం చేశారు.
నిర్మాత నాగవంశీ ఫుల్ ఇంటర్వ్యూ ఇదీ…