రసికుడు కానివాడికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం కలగకూడదని కోరుకున్నాడు వెనకటికి ఓ మహాకవి. రాను రాను తెలుగు సినిమా మేకర్లు కూడా ఇలాగే కోరుకోవాలేమో? తెలుగు ప్రేక్షకుడు మంచి సినిమాను ఆదరిస్తాడు అన్నది ఎప్పుడూ అందరూ చెప్పేమాట. అది చాలా వరకు నిజం కూడా.
కానీ మంచి సినిమాలను ఆదరించడం వరకు ఓకె. చెడు పోకడలకు దారి తీసే సినిమాలను పక్కన పెట్టాల్సిన అవసరం కూడా వుంది. అలా కాకపోతే పాలు, నీళ్లు విచక్షణ ఎక్కడ వున్నట్లు?
దర్శకుడు మారుతి వెర్బర్ డబుల్ మీనింగ్ సినిమాలు తీస్తే, బూతు డైరక్టర్ అన్నారు. ఇప్పుడు ఏకంగా విజువల్ అడల్ట్ కంటెంట్ తో సినిమా తీస్తుంటే బోల్డ్, అగ్రెసివ్, ఇంక్రెడిబుల్ అంటున్నారు. మన సెన్సారు కూడా చిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఒక్కోసారి ఫుల్ గా కోసేసి, ఏ సర్టిఫికెట్ చేతిలో పెడుతుంది. మరోసారి ఫుల్ గా వదిలేసి ఎ సర్టిఫికెట్ చేతిలో పెడుతుంది.
అర్జున్ రెడ్డిలో హీరో హడావుడిగా వచ్చే, ఆగలేని తమకంతో అమ్మాయితో వంటింటి గట్టు మీదే రతికార్యానికి రెడీ అయిపోతాడు. ఇది అద్భుత:
ఆర్ఎక్స్ 100 లో రెండు నిమషాల పాటు హీరోయిన్, హీరో పెదాలను జుర్రేస్తుంది, తన పై టాప్ విప్పి చూపిస్తుంది. హీరో హీరోయిన్ మీద వాలినపుడు, పక్కన ఇంజన్ పిస్టన్ బయటకు లోపలకు ఆడుతున్న సింబాలిక్ షాట్..పరమ అద్భుత :
ఇక ఇప్పుడు ఈ లైన్లో సినిమాలు క్యూ కడతాయి. చిన్న సినిమాలు పెద్ద విజయాలు. అహొ అద్భుతం..అంటూ భుజాలు చరుచుకోవచ్చు. నిజమే బూతు పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడు కావడంలో ఆశ్చర్యం ఏముంది? భగవద్గీత అంటే అక్కరలేదు కానీ.
ఇక మొదలెట్టండి. మాంచి అమ్మాయిని అబ్బాయిని తీసుకురావడం, వీలయినంత విప్పి చూపించడం, జనాలు చొంగలు కార్చుకుంటూ థియేటర్ల దగ్గర క్యూ కట్టడం.
మరి కొన్నాళ్లు ఇదే ట్రెండ్.