సుప్రీంకోర్టు కొన్నాళ్ల కిందట.. ఓ సంచలన తీర్పు ఇచ్చింది. అదేమిటంటే… కింది కోర్టు విచారణపై.. హైకోర్టు స్టే ఇస్తే.. అది ఆరు నెలల వరకే వర్తిస్తుంది. ఆరు నెలల తర్వాత ఆటోమేటిక్గా ఆ స్టే రద్దు అవుతుంది. కింది కోర్టు విచారణ ప్రారంభించవచ్చు. మళ్లీ స్టే కావాలంటే.. హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. కానీ స్టే ఎందుకు ఇస్తున్నారో.. హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత.. అందరి కేసులపై విచారణ ఆరు నెలల్లో ప్రారంభమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. తనపై ఉన్న పదొకండు అక్రమాస్తుల కేసుల్లోని నిందితులు… విచారణపై స్టే కోరుతూ.. హైకోర్టుకు వెళ్లడం వల్ల.. 8 కేసుల విచారణకు స్టే వచ్చింది. ఇప్పుడు ఆరు నెలల గడువు ముగిసింది కాబ్టటి.. ఆ స్టేలు ఆటోమేటిక్గా తొలగిపోయాయి. ఇక జగన్ కేసులు రోజువారీ జరిగినా ఆశ్చర్య పోనవసరం లేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఏపీ స్పీకర్ కోడెలపై ఉన్న ఓ కేసులో.. కూడా.. ఇలానే స్టే వేకెట్ అవడంతో.. కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బోలెడన్ని కేసులు ఉన్నాయి. .. అన్నింటిలోనూ స్టేలు తెచ్చుకున్నారని… చాలా కాలం నుంచి కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కేసుల్లో కూడా స్టేలు తొలగిపోయాయి కానీ.. చంద్రబాబు కేసులపై స్టేలు ఉంటే… తీసేయడం లేదు. ఒక వేళ కేసులు ఉండి.. స్టేలు ఉంటే.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. వెంటనే వాటిని తొలగించి విచారణ చేయవచ్చని.. వైసీపీ తరపున లాయర్లు ఎవరైనా పిటిషన్ వేయవచ్చు కదా..!. ఎందుకు వేయడం లేదు..?. చంద్రబాబుపై విమర్శలు చేయాలనుకున్న వారికి మొదటగా ఈ స్టేలే గుర్తుకు వస్తాయి. కానీ.. ఇలాంటి సందర్భాల్లో మాత్రం.. మళ్లీ మళ్లీ అలాంటి విమర్శలు చేయలేని పరిస్థితులు తెచ్చి పెడుతున్నాయి.
వైసీపీ నేతలు.. ఓ మాట అనేస్తే అది ప్రజల్లో పడి ఉంటుందన్నట్లుగా వ్యవహరిస్తూంటారు. ఇప్పుడు బీజేపీ నేతలు వారికి తయారయ్యారు. చంద్రబాబు స్టేల మీద ఉన్నారని ప్రచారం చేస్తూంటారు. ఎప్పటికప్పుడు.. చంద్రబాబుపై ఒక్క కేసు కూడా లేదని.. ఉంటే చూపించమని సవాల్ చేసినా ఎవరూ స్పందించరు. వారికి కావాల్సింది కేసు కాదు.. ఆ పేరుతో ప్రజల్లోకి.. ఏదో భావన పంపిస్తే చాలన్నదే వారి ప్లాన్. ఇప్పుడు ఆ అవకాశం కూడా తప్పిపోయిందనే భావన వ్యక్తమవుతోంది.