గత రెండు రోజులుగా కె.ఏ. పాల్ ని లక్ష్యం గా చేసుకుని ఇటు వైఎస్ఆర్సిపి నేతలు , సాక్షి ఛానల్ తీవ్రంగా దాడులు చేస్తున్నారు. కేవలం తమ పార్టీ అభ్యర్థులకు గండికొట్టడానికి కేఏ పాల్ ప్రయత్నిస్తున్నాడని, తమ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో అభ్యర్థులను నిలపెడుతున్నాడని సాక్షిలో కథనాలు రాస్తున్నారు. అయితే, జగన్ఆవేదనతో ఏకీభవించే వారికంటే, గతంలో ఇదే ఎత్తు గడ ని ఉపయోగించి వైయస్సార్ చిరంజీవి నిదెబ్బ కొట్టాడని, ఇది ” మీ తండ్రి నేర్పిన విద్యయే నీరజాక్షా” అని జనాలు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
వైఎస్ఆర్సిపి అభ్యర్థులను పోలిన పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు:
రాయదుర్గంలో వైఎస్ఆర్సిపి కాపు రామచంద్రా రెడ్డిని నిలబడితే, ప్రజాశాంతి పార్టీ ఉండాల రామచంద్రారెడ్డి ని నిలబెట్టింది. ఉరవకొండలోవైఎస్ఆర్ సీపీ విశ్వేశ్వర్‌రెడ్డి నిలబడితే, ప్రజాశాంతిపార్టీ విశ్వనాథరెడ్డి నిలబెట్టింది. అనంతపురంలో వైఎస్ఆర్సిపి అనంత వెంకటరామిరెడ్డి నిలబెడితే, ప్రజాశాంతి పార్టీ పగడి వెంకట్రామిరెడ్డిని పోటీకి నిలబెట్టింది. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు లోఅయితే అదే పేరు ఉన్న నంబూరు శంకరరావు అనే వ్యక్తిని నిలబెట్టింది. దాదాపు 9 స్థానాల్లో ఈ విధంగా అభ్యర్థులను నిలబెట్టింది ప్రజాశాంతి పార్టీ.
2009 – చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థు ల మీద వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో పోటీ చేసినఇండిపెండెంట్ అభ్యర్థులు:
ఇప్పుడు రెండు జాబితాలను చూశాక చెప్పండి- తన పార్టీకి ఏదో అన్యాయం జరుగుతోందంటూ జగన్ పెడుతున్న గగ్గోలు నిజంగా సమంజసమేనా? సమంజసమే అయితే, పాల్ చేస్తున్న పనిని సాక్షి ఛానల్ లో ” మహా కుట్ర” అంటూ బ్యానర్ స్టోరీలు వ్రాయిస్తున్న జగన్ చిరంజీవి కి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన దాన్ని ఏమనాలి? పేర్లు పోల్చి చూసినా, పాల్ అభ్యర్థుల పేర్లకు వైఎస్ఆర్సిపి అభ్యర్థుల పేర్లకు కాస్తయినా తేడా ఉంది కానీ, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిరంజీవి విషయంలో ఇంతకంటే భయంకరంగా నే వ్యవహరించినట్టు పైన పేర్లు చూస్తే అర్థమవుతుంది.
తన పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్న ప్పుడు జగన్ గగ్గోలు పెట్టినా, ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రాకపోవడానికి కూడా ఇదే కారణం. గతంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను అదేవిధంగా లాక్కొని ఉండడం వల్ల, వైయస్ రాజశేఖర రెడ్డి ఆ పని చేసినప్పుడు సాక్షి పత్రిక కూడా అదేదో ఘనకార్యం అన్నట్టు కీర్తించి ఉండడంవల్ల జగన్ తన ఎమ్మెల్యే ల గురించి గగ్గోలు పెడుతున్నా జనం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తన పార్టీ అభ్యర్థుల పేర్లతో పోలిన అభ్యర్థులను పోటీకి నిలబెడుతుండటం మహా కుట్ర అని జగన్ అంటున్నప్పటికీ, ఈ కారణం చేతనే, జనంలో స్పందన రావడం లేదు.