ఔను. ఇదే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఉన్న చిన్న సందేహం. పవర్ స్టార్ ఫ్యాన్స్ అనగానే హంగామా ఎక్కువ ఉంటుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా అక్కడ పవర్ స్టార్ అంటూ.. అరుపులు, కేకలతో కేక పుట్టించేస్తుంటారు. పవన్ ఆ ఫంక్షన్ కు వస్తే ఓకే. లేకపోతేనే మిగిలిన హీరోలు మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారు.
మొన్నటికి మొన్న లోఫర్ ఆడియో ఫంక్షన్ లో కూడా ప్రభాస్ మాట్లాడుతుండగా.. పవర్ స్టార్ అంటూ హడావిడి చేశారు. దీంతో బాహుబలి కూడా ‘ఐ లైక్ పవన్ కళ్యాన్.. ఇక మాట్లాడొచ్చా’ అన్నాడంటే.. పవన్ ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్.. తన అభిమానులను కొంచెం కట్టడి చేయకపోతే అతనికే చెడ్డపేరు వస్తుందంటూ దీని మీద పూరి జగన్నాథ్ కూడా ట్వీట్ చేశాడు.
ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటంటే.. ఇవాళ అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతోంది. హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో జరిగే వేడుకకి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా హాజరవుతున్నారు. పవన్ వస్తాడా రాడా అనేది అనుమానమే. ఒకవేళ వస్తే సరే. రాకపోతే.. పవన్ వీరాభిమానుల హంగామాని తట్టుకోవడం కొంచెం కష్టమే అనే భావన కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్ కాదు కాబట్టి వచ్చిన వారంతా బుద్ధిగా కూర్చుని ఫంక్షన్ ఎంజాయ్ చేసి వెళ్లిపోతారులే అనే ఆలోచన కూడా చేస్తున్నారు.