జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ అగ్రనేతల వైఖరి ఎప్పుడూ గొప్పగా ఉండదు. తాజాగా ఆయనను అత్యవసరంగా ఢిల్లీకి రావాలని పిలిపించారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ఇంటికి వెళ్లారు. వారి కుటుంబసభ్యులతో ఫోటోలు దిగి గంట సేపు మాట్లాడి వచ్చారు. కానీ జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ గురించి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మంగళవారం వారు సమయం ఇస్తారని మాత్రం సమాచారం ఇచ్చారు. ఇది జనసేన నేతల్ని ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ పిలిపించి ఓ రోజు ఖాళీగా ఉంచడం ఏమిటని వారిలో అసహనం వ్యక్తమవుతోంది.
అసలు పవన్ కల్యాణ్ ను ఎదుకు పిలిపిచారన్నదానిపై స్పష్టత లేదు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఒప్పించాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఏపీ రాజకీయాలపై హైకమాండ్ అసలు ఆసక్తిగా లేదని అక్కడ వైసీపీకి మద్దతుగా ఉంటున్నందున… కొత్తగా చేపట్టాల్సిన రాజకీయాలేం లేవని భావిస్తున్నారని అంటున్నారు. కానీ పవన్ పొత్తులో ఉన్నారు. ఆయనను ఇతర చోట్ల ఉపయోగించుకోవడానికి హైకమాండ్ ఆసక్తి చూపిస్తోంది. కానీ పవన్ మాత్రం మందుగా ఏపీ సంగతి తేల్చాలంటున్నారు. కలసి పని చేయాలా వద్దా అన్నది తేల్చాలంటున్నారు. కలిసి పని చేయడానికి పవన్ ఆసక్తిగా లేరు. ఆ విషయాన్ని ఎలా చెప్పారో అలా చెప్పేశారు. దీన్ని బీజేపీ నేతలుకూడా సీరియస్గా తీసుకోవడంలేదు.
ఏపీలో పొత్తు నిలుపుకోవాలన్న ప్రయత్నాలు బీజేపీ హైకమాండ్ కూడా చేయడం లేదని చెబుతున్నారు. అలా నిలుపుకోవాలటే వైసీపీకి తక్షణ సహకారం నిలిపివేయాల్సి ఉంటుంది. వివేకా హత్య కేసు లాంటి విషయాల్లో సీబీఐకి స్వేచ్చ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ఫేవర్స్ను జగన్కు ఆపడానికి సిద్ధంగా లేరని .. అంటున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ .. ఢిల్లీ పర్యటనలో కర్ణాటకలో బీజేపీకి ప్రచారానికి ఒప్పుకుంటారా.. ఏపీ రాజకీయాల్లో ఏం చేయాలనుకుంటున్నారు అన్నదానిపై స్పష్టత తీసుకునే అవకాశం ఉంది.