ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన శాసన సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతకు వేరే చోట ఆస్తులు ఉన్నా వాటిని అఫిడవిట్ లో పేర్కొనలేదని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయంపై రామచంద్ర యాదవ్ ఈసీ, గవర్నర్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.
Also Read : పెద్దిరెడ్డి సరే… ఆ మాజీ మంత్రుల సంగతేంటో?
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు..పెద్దిరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డిని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. మంగళవారం దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగనుందని తెలుస్తోంది. నిజంగానే పెద్దిరెడ్డి తన భార్య ఆస్తులను సక్రమంగా పొందుపరచలేదని తేలితే మాత్రం ఆయన శాసన సభా సభ్యత్వం రద్దు కానుంది.