రాజకీయాల్లో ప్రచార శైలి చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని.. విధానాలు, ప్రచార వ్యూహాలు రూపొందించుకోవాలి. ఈ విషయంలో .. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వెనుకబడిపోయారు. చంద్రబాబును తిట్టడమే తన ప్రచార వ్యూహంగా భావిస్తున్నారు. కానీ టీడీపీ అధినేత మాత్రం.. చాలా వ్యూహత్మకంగా… జగన్ ను కార్నర్ చేస్తున్నార.ు
చంద్రబాబు విమర్శలకు జగన్ దగ్గర ఆన్సర్ లేదా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి .. నిస్సహాయత మీద గురి పెట్టారు. చంద్రబాబును ఓడించడానికి.. తన వ్యూహాలు సరిపోలేదని భావించారో… ఇతర వనరుల సాయం అందుతుందని ఆశ పడ్డారో కానీ… జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో.. టీఆర్ఎస్తో అత్యంత సన్నిహితంగా వ్యవహరించడం ప్రారంభించారు. టీఆర్ఎస్తో స్నేహం వల్ల… జగన్మోహన్ రెడ్డి.. ఉన్న పళంగా కొన్ని ప్రయోజనాలు దక్కాయనేది… ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అందులో మొదటిది… తెలంగాణ పోలీసుల్ని ప్రయోగించి.. టీడీపీని ఇబ్బంది పెట్టడం .. అలాగే.. చివరి క్షణంలో.. టీడీపీలోని ఎంపీ అభ్యర్థుల్ని లాక్కోవడం.. వంటి ప్రయోజనాలు వైసీపీకి దక్కాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే.. ఎన్నికల ఖర్చుల కోసం.. కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారని.. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. ఈ ప్రయోజనాలు పొందేందుకు.. కేసీఆర్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని… రేపు ఒక్క ఎంపీ సీటు వచ్చినా.. దానికి టీఆర్ఎస్ ఖాతాలో కలుపుకుని.. ఢిల్లీలో పెత్తనం చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.
మోడీ, కేసీఆర్‌లపై మౌనం అనుమానాలు తెచ్చి పెట్టడం లేదా..?
ఎన్నికల ప్రచారంలో… టీఆర్ఎస్, వైసీపీ దోస్తీపై చంద్రబాబు.. అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై నిలిపివేయాలంటూ.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిందంటున్నారు. అలాగే.. ఎగురు రాష్ట్రమైన తెలంగాణ అనుమతులు లేకుండా.. అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందని… వాటిపై.. తన విధానమేంటో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏలాగే.. ఏపీకి రావాల్సిన కరెంట్ బకాయిలు, ఉమ్మడి సంస్థల విభజన.. ఇలా ఏ విషయంపైనైనా జగన్ మాట్లాడటం లేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో.. కేంద్రం తీరుపైనా.. జగన్ సైలెంట్‌గా ఉండటం.. టీడీపీకి కలిసి వస్తోంది. పదే పదే ఆ విషయాలను ప్రజల్లో చర్చకు పెడుతోంది. అయినా… జగన్మోహన్ రెడ్డి స్పందించలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను.. తెలంగాణ అడ్డుకున్నా.. పూర్తి చేస్తామని చెప్పడం లేదు. అనుమతుల్లేకుండా… ఎగువ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పడం లేదు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు, ఉమ్మడి సంస్థల విభజన చేసి తీరుతామని ఎక్కడా స్పందించడం లేదు. ఇక విభజన హామీల సంగతి సరే సరి. దీంతో సహజంగానే.. టీడీపీకి విమర్శించడానికి అడ్వాంటేజ్ వస్తోంది.
చంద్రబాబునే విమర్శిస్తే ఓట్లు వచ్చేస్తాయా..?
తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. బహిరంగ ప్రకటన చేయకపోయినా.. ఆ పార్టీకి మద్దతుగా ఉండే సామాజికవర్గం మొత్తాన్ని.. టీఆర్ఎస్ వైపు మళ్లించడానికి ప్రయత్నించారు. ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి జగన్ ను గెలిపించే బాధ్యత తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నా.. తిప్పికొట్టలేని పరిస్థితి వైసీపీలో ఏర్పడింది. మోడీ, కేసీఆర్‌లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా… చంద్రబాబునే విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం రాజకీయం ప్రకారం పొసగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.