బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ చేసిన ప్రధాన నిందితుడిగా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావును ఇక తెలంగాణ పోలీసులు పట్టుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని అంటున్నారు.. ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికా పారిపోయారు. వైద్య చికిత్స కారణం చెప్పారు. అక్కడకు వెళ్లిన తర్వాత తాను ఆరు నెలల్లో వస్తానని కోర్టుకు కూడా చెప్పారు. మధ్యలో తిరిగి వచ్చేందుకు రెడీ అయ్యారని దుబాయ్‌కు వచ్చాక మళ్లీ వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు.
అక్కడకు వెళ్లిన తర్వాత ఏం జరిగిందో కానీ.. భిన్నమైన పద్దతుల్లో ప్రయత్నించి అక్కడే శాశ్వతంగా ఉండే ఏర్పాట్లు చేసుకున్నారని తెలుస్తోంది. ఓ వంద కోట్ల వరకూ పెట్టుబడులు పెడితే అమెరికాలో గ్రీన్ కార్డు ఇచ్చే స్కీమ్స్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా.. ఆయన కుటుంబసభ్యులు అక్కడే స్థిరపడిన వారు చేసిన స్పాన్సర్ షిప్ ద్వారా ఆయన గ్రీన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారని అంటున్నారు. అది విజయవంతం అయిందని ఇక ప్రభాకర్ రావు రారని చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన వస్తే ఇంకా అనేక మంది గత ప్రభుత్వ పెద్దలను అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయి . అయితే ఆయన మాత్రం తప్పించుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికీ మరో నిందితుడు ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ రావు కూడా కనిపించకుండా పోయారు. వీరి కోసం రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. పాస్ పోర్టులు రద్దు చేశారు. ఈ ట్యాపింగ్ కేసులో అరెస్టయినా ఇతురులు ఇంకా జైల్లోనే గడుపుతున్నారు.