బీజేపీపై పోరాటంలో కేసీఆర్ విజయం సాధిస్తారని గట్టిగా నమ్మకం పెట్టుకున్న ప్రకాష్ రాజ్ ఇంత వరకూ బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. ఆయన కర్ణాటకలో పార్టీ తరపున వ్యవహారాలు చక్క బెడతారనుకుంటే అసలు బీఆర్ఎస్ వ్యవహారాల్లోనే కనిపించడం మానేశారు. కేసీఆర్ ఆయనను దూరం పెట్టే అవకాశం లేదు. అలాంటి వారు ఉండాలని కేసీఆర్ కోరుకుంటారు. కానీ ప్రకాష్ రాజే దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు.
ప్రకాష్ రాజ్ .. కేసీఆర్ కు మద్దతుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన తరపున పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా లేరని … చెబుతున్నారు. ఎప్పుడు రమ్మన్నా వస్తానని… రాజకీయ పార్టీలో మాత్రం చేరమని ఆహ్వానించవద్దన్నది ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం తెర వెనుక పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ పొలిటికల్ కెరీర్ ని ప్రారంభించేందుకు ఆయన సిద్ధంగా లేరని చెబుతున్నారు.
ప్రకాష్ రాజ్ చాలా టిపికల్ క్యారెక్టర్. ఆయన బీఆర్ఎస్ కు ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారో సన్నిహితులకూ అంతుబట్టదు. బీజేపీని తీవ్రంగా విమర్శిస్తారు. అంత వరకూ బాగానే ఉన్నా…. ఇతర రాజకీయ పయనం విషయంలో క్లారిటీ ఉండదు. ఆయన ఇలాంటి తీరు వల్లే… మా ఎన్నికల్లో చిరంజీవి క్యాంప్ సపోర్ట్ ఉన్నా దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయాల్లోనూ అదే పరిస్థితి.