‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్’ సినిమాలతో వరసాగా మూడు మంచి విజయాలు సొంతం చేసుకొని హ్యాట్రిక్ కొట్టిన యువ హీరో రాజ్ తరుణ్ కి ఆ తర్వాత నుంచి సరైన సక్సెస్ లు లేవు.
ఒక రచయితకు దర్శకుడిగా అవకాశమిస్తూ రాజ్ తరుణ్ నటించిన ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’తో రాజ్ తరుణ్ కెరీర్ లో తొలి ప్లాప్ నమోదయ్యింది. ఆ తర్వాత మంచు విష్ణుతో కలిసి నటించిన ‘ఈడో రకం.. ఆడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలు ఫరవాలేదనిపించుకున్నాయి. నెక్స్ట్ వచ్చిన ‘అందగాడు’ ది కూడా అదే పరిస్థితి.
అక్కినేని నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన ‘రంగుల రాట్నం’ తో ఫస్ట్ డిజాస్టర్ చూసిన రాజ్ తరుణ్.. తాజాగా ‘రాజుగాడు’ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రంపై తరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా రిజల్ట్ కూడా తేడా వచ్చినా తరుణ్ చేతిలో ఇప్పటికే ఇంకో రేండు మూడు సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు వెంటనే జరిగే ప్రమాదమేమీ లేనప్పటికీ.. యువ హీరోల రేసులో అతను మరింత వెనకబడిపోతాడు.
ఒకే నిర్మాణ సంస్థకు వరసగా మూడు సినిమాలు (కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రాజుగాడు) చేసేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం, వరసగా ఇద్దరు లేడీ డైరెక్టర్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం (రంగులరాట్నం-శ్రీరంజని, రాజుగాడు-సంజానారెడ్డి), కొత్త హీరోయిన్స్ ని ఎంకరేజ్ చేసేందుకు తహతహలాడడం, పబ్లిక్ అండ్ ప్రెస్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో అలక్ష్యం చూపడం వంటి అంశాలు రాజ్ తరుణ్ కెరీర్ కొంచెం గాడి తప్పేలా చేశాయి.
మరి, తాజాగా వస్తున్న ‘రాజుగాడు’తో రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుందో.. లేక మరింత గాడి తప్పుతుందో… మరో నాలుగయిదు రోజుల్లో తేలిపోనుంది!!