రామ్ – లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందని అనగానే, టాలీవుడ్ షాకైంది. నిజానికి ఇది కొంచెం విచిత్రమైన కాంబినేషన్. పైగా లింగు స్వామి ఫ్లాపుల్లో, రామ్ హిట్స్లోనూ ఉన్నాడు. తమిళ హీరోలే లింగు స్వామిని నమ్మడం లేదు. పైగా.. హవీష్ లాంటి హీరోతో మొదలైన సినిమా కూడా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ పిలిచి మరీ అవకాశం ఇవ్వడం టాలీవుడ్ ని ఆశ్చర్యపరిచింది. ఇటీవలే లింగు స్వామి రామ్ కి కథ మొత్తం చెప్పేశాడు. దానికి రామ్ ఎగ్జైట్ అయి ట్వీట్ కూడా చేశాడు.
ఈ సినిమాలో రామ్ పోలీస్ గా కనిపించబోతున్నాడని తెలుగు 360 ముందే చెప్పింది. ఇందులో రామ్ పోలీస్. తన కెరీర్లో పోలీస్ గా కనిపించడం రామ్ కి ఇదే తొలిసారి. కాబట్టి.. బాగా ఎగ్జైట్ అయ్యుండొచ్చు. కాకపోతే… ఇప్పుడు ఆ గెటప్ కోసం రామ్ చాలానే చేయాల్సివస్తోంది. రామ్ ది పిట్ట పర్సనాలిటీ. లవర్ బోయ్, మాస్ పాత్రలకు బాగా సూటవుతుంది. పోలీస్ అంటే.. కాస్త ఫిజిక్ పెంచాల్సిందే. రెడ్ కోసం కాస్త ఒళ్లు చేశాడు రామ్. ఇప్పుడు లింగు స్వామి కథ కోసం.. కూడా అలాంటి కసరత్తులే మొదలెట్టాడట. బాడీ పెంచి – లుక్ మార్చడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. ఇందులో రామ్ పోలీసే అయినా.. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పరిమితంగానే ఉంటాయని, పోలీస్ యూనిఫామ్ లో కనిపించే అవసరం కొన్ని సన్నివేశాల్లో నే వస్తుందని తెలుస్తోంది. కాబట్టి… రామ్ బాగానే మేనేజ్ చేయొచ్చు. ప్రతీ హీరోకీ.. ఓ మాస్ పోలీస్ పాత్ర చేయాలని ఉంటుంది. ఆ కోరిక రామ్ ఈ సినిమాతో నెరవేర్చుకుంటున్నాడు.