ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ .. తన పరువును కాపాడుకోవడానికి.. తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించిన రవి కిషన్‌పై ఆధారపడుతున్నారు. గోరఖ్‌పూర్ నుంచి… ఆయనను అభ్యర్థిగా నిలబెట్టారు. సామాజిక సమీకరణాలు లెక్కలేసుకోకుండా… రవికిషన్ గ్లామర్‌పై ఆధారపడి.. ఆయనను అభ్యర్థిగా ఖరారు చేశారు. రవికిషన్ తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించక ముందే.. భోజ్‌పురి భాషలో.. సూపర్ స్టార్. అక్కడ ఆయనకు చాలా క్రేజ్ ఉంది. యోగి.. తన పీఠాధిపతిగా ఆశ్రమం నడుపుతున్న నియోజకవర్గం ఉన్న గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానంలో… వరుసగా ఐదు సార్లు గెలిచారు. ఆ నియోజకవర్గాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు. కానీ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించిన తర్వాత.. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ కారణంగా లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి… తన లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో మాత్రం.. తన పార్టీని గెలిపించలేకపోయారు.
సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో… యోగికి… కష్టకాలం ప్రారంభమయింది. ఓ ముఖ్యమంత్రిగా ఉండి.. తన నియోజకవర్గాన్ని గెలిపించకపోయాడని.. ఇక ఇతర చోట్ల ప్రచారం చేస్తే.. ఆయన వల్ల వచ్చే ఉపయోగం ఏమిటన్న చర్చ ఆ పార్టీలోనే ప్రారంభమయింది. ఇప్పుడు బీజేపీ.. ఢిల్లీలో అధికారంలో ఉండాలా లేదా.. అన్నది.. యూపీలో వచ్చే సీట్లపైనే ఆధారపడి ఉంది. దీంతో యోగిపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ సారి సొంత నియోజకవర్గంపై మరింత దృష్టి పెట్టి… రవికిషన్ ను అభ్యర్థిగా ఖరారు చేసుకున్నారు. నిజానికి ఉపఎన్నికల్లో గోరఖ్‌పూర్ నుంచి ఎస్పీ తరపున పోటీ చేసి గెలిచిన అభ్యర్థిని.. బీజేపీలో చేర్చుకున్నారు. అయినప్పటికీ… ఫలితం అనుకూలంగా వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో.. ఆయనను వేరే చోటికి మార్చి.. రవికిషన్ ను తెచ్చి పెట్టారు. పరువు కాపాడతారని ఆశ పెట్టుకున్నారు.
రవికిషన్ భోజ్ పురిలో సూపర్ స్టారే కానీ.. ఆయన రాజకీయంగా ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. 2014లో కాంగ్రెస్ తరపున ఓ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. అంటే ఆయన సినీ గ్లామర్ ఓట్లు తెచ్చి పెట్టలేదని తేలిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు అయినా.. వర్కవుట్ అవుతుందో లేదో చెప్పడం కష్టమే. మే 23న జరిగే కౌంటింగ్‌లో… రవి కిషన్‌కు, యోగి ఆదిత్యనాథ్‌కు ముందే దీపావళి వస్తుందో.. లేదో తేలిపోతుంది.