రేవంత్ రెడ్డి కోసమే కేసీఆర్ కట్టించినట్లుగా ప్రచారంలోకి వచ్చిన సచివాలయంలో కొన్ని మార్పులను సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్నారు. సచివాలయం నాలుగు వైపులా నాలుగు గేట్స్ ఉన్నాయి. అయితే లుంబిని పార్క్‌కు అపోజిట్ గా బాహుబలి గేట్ పెట్టారు. ఇపుడా గేట్ క్లోజ్ చేయిస్తున్నారు. కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం దాదాపుగా రూ. మూడు కోట్లు ఖర్చు చేస్తున్నారు. మాములుగా అయితే ఆ గేటుతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ గేటు నుంచే సీఎం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఎందుకో కానీ ఇప్పుడా గేటునుక్లోజ్ చేయిస్తున్నారు.
సహజంగా ఇలాంటి మార్పులు వాస్తు దోషాల కారణంగానే చేస్తూంటారు. ముఖ్యమంత్రికి ఆ గేటు నుంచి రాకపోకలు సాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని అనుకోవడం లేదా.. ఆ గేటు భవనానికి వాస్తు పరంగా బాగోలేదని అనుకోవడం వల్ల మార్పు చేయాలని నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ అసలు అక్కడ సెక్రటేరియట్ కట్టాలనుకోలేదు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ దగ్గర నుంచి చాలా చూశారు. ఏదీ వర్కవుట్ కాకపోవడంతో చివరికి ఇప్పుడు ఉన్న స్థలంలో ఉన్న వాటిని కూల్చేసి కొత్తవి కట్టించారు . ఇక్కడా వాస్తు సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.
కేసీఆర్ సచివాలయం కట్టించారు కానీ పూర్తి స్థాయిలో సీఎంగా అందులో విధులు నిర్వహించలేకపోయారు. రేవంత్ పూర్తి స్థాయిలో సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆయనకు వరుసగా సమస్యలు వస్తున్నాయి. సింపుల్ గా అయిపోవాల్సిన పనులు కూడా సాగతీతగా మారుతున్నాయి. దీంతో సమస్యల పరిష్కారం కోసం పండితుల నుంచి వచ్చిన సలహా మేరకు గేట్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నాయి.