మంత్రి కేటీఆర్‌పై మొదటి కేసుకు రేవంత్ సర్కార్‌కు మెటీరియల్ దొరికింది. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 55 కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అర్వింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం చేపట్టాలని ప్రాసెస్ చేపట్టలేదు. కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో రేవంత్ సర్కార్ ..ఐఏఎస్ అర్వింద్ కుమార్ ను వివరణ అడిగింది. సీఎస్ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు.
తనంతట తానుగా ఆ డబ్బులు రిలీజ్ చేశానని ఒప్పుకున్నట్లుయితే.. మొత్తం తెచ్చి కట్టాల్సి ఉండటమే కాకుండా కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో ఆయన కేటీఆర్ ను ఇరికించేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పబట్టే డబ్బులు రిలీజ్ చేశానని వివరణ ఇచ్చారు. దీంతో ప్రభుత్వంపై ఇరువురిపై కేసులు పెట్టి డబ్బులు రికవరీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం న్యాయసలహా తీసుకుంటున్నారు.
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, అర్వింద్‌కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి.. ORR అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. ఫార్ములా ఈ కేసులో వీరిద్దరూ కలిసి దొరికిపోవడం.. రేవంత్ సర్కార్‌కు వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.