తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ ఉంది. ఇవాళ ఆయన డ్రగ్స్ కేసులపై సమీక్ష చేశారు. తెలంగాణలో డ్రగ్స్ జాడలు ఉండకూదని సమీక్షలో ఆదేశించారు. బయటకు తెలిసింది ఇదే కానీ.. డ్రగ్స్ కేసుల గురించి రేవంత్ రెడ్డి సీరియస్ గ ాఆరా తీశారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసుల విషయంలో చాలా సీరియస్ గా పోరాడారు. కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వాటిని బయటకు తీస్తున్నారు.
గత ప్రభుత్వంలో డ్రగ్స్ కేసుల్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారన్న అభిప్రాయం ఉంది . టాలీవుడ్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఆ కేసుల్ని బూచిగా చూపించుకున్నారని అంటారు. అందుకే టాలీవుడ్ స్టార్లు మొత్తం బీఆర్ఎస్ పెద్దలతో సన్నిహితంగా ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో.. గతంలో తాను చేసిన పోరాటానికి తగ్గట్లుగా రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసుల్ని బయటకు తీస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు గతంలోలా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.
సినిమోటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ నుంచి తనకు ఎవరూ ఫోన్ చేయలేదని.. ఒక్క దిల్ రాజు మాత్రం ఫోన్ చేశాడని చెప్పుకున్నారు. అంటే ఆయన ఉద్దేశం… తమ ప్రభుత్వంతో టచ్ లోకి రావాలని టాలీవుడ్ స్టార్లకు సూచించినట్లే అనుకోవచ్చు. తర్వాతి రోజే రేవంత్ సమీక్ష చేశారు.ఈ కేసులో ఎలాంటి కదలికలు ఉంటాయన్నది ముందు ముందు వేచి చూడాల్సిఉంది.