విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పేశారు. నే పోతా అన్నయ్య.. అనే పోతా అన్నయ్యా అని జగన్ కు చెప్పేశారు. ఈ నిర్ణయం చాలా మంది వైసీపీ నేతలకు షాకింగ్ లాంటిదే. ఎందుకంటే జగన్ రెడ్డి ఓ సారి సీఎం అయ్యారంటే దానికి ఎక్కువ కారణం విజయసాయిరెడ్డి. 2014లో వైసీపీ ఓడిపోయిన తరవాత నెంబర్ టు గా మారిన ఆయన అన్ని పనులు చక్కబెట్టారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని వాడుకుని టీడీపీని ఇబ్బందిపెట్టారు ప్రశాంత్ కిషోర్ తో పనులు చేయించుకుని పార్టీని గెలిపించారు.
2019లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు జగన్, విజయసాయిరెడ్డి ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు రూం బయట సజ్జల ఉన్నారు. కానీ 2024 ఎన్నికలనాటికి విజయసాయిరెడ్డి ఎక్కడో ఉన్నారు. సజ్జల లోపల ఉన్నారు. కానీ మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. విజయసాయిరెడ్డిని దూరం చేసుకోవడంతోనే జగన్ పతనం ప్రారంభమయిందని చాలా మంది అనుకున్నారు. సజ్జల వల్లే జగన్ పతనం పాతాళానికి పోయిందని ఆయనను దూరం పెట్టకపోతే మొత్తం పార్టీ నాశనమవుతుందని ఆందోళన చెందుతూ వస్తున్నారు .
ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా సన్యాసం పుచ్చుకున్నారు. ఇక తనకు ఎదురు లేదని వైసీపీ రాష్ట్ర కన్వినర్ కూడా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటారేమో కానీ.క్యాడర్ మాత్రం… ఈయన వదిలి పెట్టడా అన్న ఫీలింగ్ తో ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇలాంటి రాజకీయ సన్యాస ప్రకటన వచ్చిన రోజున.. వైసీపీలో అసలైన సంబరాలు కనిపించే అవకాశం ఉంది.