కొంతమంది దర్శకులు… హీరోల్ని రిపీట్ చేస్తుంటారు. అందుకే చూసిన కాంబినేషనే మళ్లీ మళ్లీ చూసే అవకాశం దక్కుతుంటుంది. ఇంకొంతమంది దర్శకులు హీరోయిన్లను రిపీట్ చేస్తుంటారు. త్రివిక్రమ్ – సమంత, విక్రమ్ కె.కుమార్ – సమంత…. కాంబినేషన్లు ఎలా సెట్టవుతున్నాయో, అలాగన్నమాట. సంపత్ నంది కూడా తమన్నానే కావాలంటున్నాడు. రచ్చ సినిమాలో కథానాయికగా తమన్నాని ఎంచుకొన్న సంపత్ నంది… ఆ తరవాత రవితేజ బెంగాల్ టైగర్‌కీ తమన్నానే కోరుకొన్నాడు. ఇప్పుడు గోపీచంద్‌తో సంపత్ నంది ఓ సినిమా చేయబోతున్నాడు. ఆచిత్రంలో కథానాయికగా తమన్నాని తీసుకొందామన్న ఆలోచనలో ఉన్నాడట.
తమన్నాతో సంపత్ నందికి ఎప్పటి నుంచో పరిచయం. సంపత్ దర్శకుడిగా బిజీ కాకముందు ఫొటో షూట్లలో, యాడ్ మేకింగ్‌లో ఉండేవాడు. అప్పటి నుంచీ తమన్నాతో స్నేహం ఉంది. అందుకే… తన ప్రతీ సినిమాలోనూ తమన్నా ని ఉండేలా చూసుకొంటున్నాడు. తమన్నా కూడా సంపత్‌పై ఉన్న సాఫ్ట్ కార్నర్ దృష్ట్యా… అడిగిన వెంటనే ఎన్నికాల్షీట్లు కావాలంటే అన్నీ ఇవ్వడానికి రెడీ అయిపోతోందట. ఏంటో ఈ అనుబంధం..?! మొత్తానికి సంపత్ – తమన్నాలు కలసి కట్టుగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్నమాట.