తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఓ రకమైన అనిశ్చిత స్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి వర్గం కష్టమైనా.. నష్టమైనా చురుకుగా పని చేస్తూంటే.. ఇతర సీనియర్లు మాత్రం చాలా వరకూ నింపాదిగా ఉంటున్నారు. తాము కష్టపడి పార్టీకి ప్రయోజనం కల్పించినా అది రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుందని వారి ఆలోచన కావొచ్చు. చాలా వరకూసొంత కార్యక్రమాలు చేపడుతున్నారు. లేకపోతేలేదు. మునుగోడులోనూ అదే కనిపిస్తోంది. ముందు బాధ్యతలు తీసుకున్న మధుయాష్కీ తర్వాత వదిలేశారు. అప్పట్నుంచి రేవంత్ రెడ్డే అన్నీ చూసుకుంటున్నారు.
ఓ వైపు పీసీసీ బాధ్యతలు.. మరో వైపు మునుగోడు ఉపఎన్నిక వ్యూహాలు.. అదే సమయంలో భారత్ జోడో యాత్ర సన్నాహాలు ఇలా రేవంత్ రెడ్డి అన్ని రకాల పనులనూ చూసుకోవాల్సి వస్తోంది. మునుగోడు ఉపఎన్నిక విషయంలో కోమటిరెడ్డి వంటి సీనియర్లు తేడాగా వ్యవహరిస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారనే కాని.. కాంగ్రెస్ సీనియర్లపైనే ఆరోపణలు చేసి రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి విక్రమార్క వంటి సీనియర్ల వ్యూహాలు మరీ భిన్నంగా ఉన్నాయి.
అయితే భారత్ జోడో యాత్ర మాత్రం రాహుల్ గాంధీది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలందరూ కష్టపడితేనే ప్రయోజనం ఉంటుంది. తెలంగాణలో భారీ ఆదరణ రాహుల్ యాత్రకు లభిస్తే ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డికి వస్తుందని సీనియర్లు అనుకుంటే మాత్రం… కాంగ్రెస్‌లో కొత్త కొత్త వివాదాలు ఆ సమయానికి రావొొచ్చు. రేవంత్ పెత్తనం చేస్తున్నారని.. తమకు సమాచారం ఇవ్వడం లేదని ఇలా సిల్లీ రీజన్స్‌తో మీడియాకెక్కే చాన్స్ ఉంది. ఓ రకంగా తెలంగాణ కాంగ్రెస్‌కు రాహల్ గాంధీ జోడో యాత్ర ఫైనల్ చాన్స్. గ్రూపు తగాదాలతో దాన్ని కూడా సద్వినియోగం చేసుకకోపేత ఇక కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేరు.