సునీల్ బెస్ట్ కమెడియన్. బ్రహ్మానందం తర్వాత బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఇది గతం. ఇప్పుడు సునీల్ హీరో అయిపోయాడు. వరుసగా ఓ రెండు హిట్లు పడ్డాయి. అయితే ఆ తర్వాతే స్టార్ అయ్యింది బ్యాడ్ టైం. హీరోగా సునీల్ కు ఇప్పుడు విజయాలు లేవు. గత కొన్నాళ్ళుగా ఓ హిట్టు కోసం తెగ ఆరాటపడుతున్నాడు సునీల్. మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, వీడు గొల్దెహ్ హే, జక్కన్న .. ఇలా వరుసగా సినిమాలు నిరాశ పరిచేశాయి.
సునీల్ నుండి వసున్న సినిమాలు చూస్తుంటే బాడీలాంగ్వేజ్ సెట్ కాని కధలను ఎంచుకుంటున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. బేసిగ్గా సునీల్ ది కామెడీ ఫేసు. కానీ.. సిక్స్ ప్యాక్ తెచ్చుకొని యాక్షన్ ఇమేజ్ కూడా కొట్టేద్దామని ట్రై చేశాడు. కానీ అవేం వర్కవుట్ కాలేదు. బిల్డప్పులు, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ కి అస్సల్ మ్యాచ్ కావడం లేదు. అన్నీ ఆర్టిఫిషియల్ గా వుంటున్నాయి.
ఇపుడు సునీల్ మరో సినిమా చేస్తున్నాడు. అదే.. ‘ఉంగరాల రాంబాబు’. క్రాంతి మాధవన్ దర్శకుడు. ఓనమాలు , మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి ఫీల్ గుడ్ సినిమాలు తీశాడాయన. ఇప్పుడు సునీల్ కోసం ఓ కామెడి ఎంటర్ ట్రైనర్ చేస్తున్నాడు. తాజగా సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడిగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట. సునీల్ ప్రధాన బలం కామెడీ. ఇప్పుడు ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు సునీల్. మరీ ‘ఉంగరాల రాంబాబు’ తోనైనా జాతకం మారుతుందేమో చూడాలి.