జనసేన అధినేత పవన్ కల్యాణ్… క్రిస్మస్ పర్యటన కోసం.. యూరప్‌కు వెళ్లి వచ్చిన తర్వాత.. నేరుగా విజయవాడ వచ్చారు. ఆయనను కలిసిన పార్టీ నాయకులే కాదు.. ఆయన ఆహార్యాన్ని చూసిన .. మీడియా కూడా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే.. ఆయన ఎప్పుడూ లేని విధంగా ఓ తాయెత్తును.. మెడలో వేసుకున్నారు. తొలి రోజు.. పవన్ మెడలో ఆ తావీజును చూసి.. చాలా మంది జర్నలిస్టులు రకరకాలుగా ఆలోచించారు. యూరప్ చర్చిల్లో కూడా… ఇలాంటి తావీజులు కడతారా..? అనేదే ఆ చర్చలకు ప్రధాన టాపిక్. పిల్లలకు… దిష్టి పోవడానికి లేకపోతే… జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి… ఇలాంటి తాయెత్తులు కడుతూ ఉంటారు. అలాంటిదే పవన్ కల్యాణ్ ధరించారు. అయితే అది యూరప్ చర్చిలది కాదని…మాత్రం వారికి తర్వాత క్లారిటీ వచ్చింది.
పవన్ కల్యాణ్ కు నమ్మకాలు ఎక్కువే. ఎంత అయినా సినిమా మనిషి కాబట్టి.. సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. ఆయన మూడో భార్య క్రిస్టియన్ అయినప్పటికీ.. పవన్ కల్యాణ్.. హిందూ దేవతల్ని అభిమానిస్తారు. ప్రత్యేకంగా యజ్ఞాలు కూడా చేస్తారని గతంలో చదవాం. అలాగే.. తన బిడ్డ పుట్టు వెంట్రుకలను తిరుమలలో ఇచ్చారని.. కూడా చూశాం. అంటే.. ఆయనకు దేవుళ్లపై.. మంచి నమ్మకాలు ఉన్నాయనే అర్థం. ఆ నమ్మకాల ప్రకారమే పవన్ కల్యాణ్ ఇప్పుడు తావీజు పెట్టుకుని పెట్టుకున్నారని అనుకుంటున్నారు. ఆ తావీజు కథేమిటో పవన్ కల్యాణ్‌ను అడిగేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఆయన పార్టీ నేతలు మాత్రమే కాదు… జర్నలిస్టులు కూడా.
తాయెత్తును పవన్ కల్యాణ్.. వ్యక్తిగతంగా వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి ధరించారా.. లేకపోతే.. పార్టీ కోసమా.. అన్నదానిపై.. ఇప్పుడు జనసేనలో చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా.. ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం పదే పదే వస్తున్నప్పుడు.. దర్గాల దగ్గరో… మరో చోటో.. ఇలాంటి తాయెత్తులు కడుతూంటారు. దుష్టశక్తులు దగ్గరకు రాకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు. పవన్ కల్యాణ్ ఇప్పుడు వ్యక్తిగతంగా… తాయెత్తుతో ఎలాంటి ప్రయోజనం ఆశిస్తున్నారో మాత్రం క్లారిటీ లేదు. ఆయన ఇప్పుడు పూర్తిగా పార్టీ మీదే దృష్టి కేంద్రీకరించారు కాబట్టి.. ఆయన తాయెత్తు కూడా… జనసేన కోసమే అయి ఉండవచ్చంటున్నారు…!