బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిని వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఆయన తన పరిస్థితిని చూసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. పార్టీ మారిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయనతో మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా తన కుమారుడికి టిక్కెట్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలరో టీడీపీ ముఖ్యనేతలతో వారు టచ్లోకి వెళ్లారు.
అయితే బాలినేని శ్రీనివాసరెడ్డిని, మాగుంట శ్రీనివాసులరెడ్డిని నమ్ముకోవడం దండగ అన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది. బాలినేని ఎలా చూసినా జగన్ రెడ్డి బంధువేనని.. రేపు పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్లీ జగన్ రెడ్డి పిలిచి టిక్కెట్ ఆఫర్ ఇస్తే వెళ్లిపోతారని అలాంటి వారిపై నమ్మకం ఉంచుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి కాస్త మంచి ఇమేజ్ ఉన్నా గతంలో ఓ సారి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినా గత ఎన్నికలకు ముందు టీడీపీ పరిస్థితి బాగోలేదని వైసీపీలో చేరి ఎంపీ అయ్యారు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి బాగోలేదని.. తన పరిస్థితి ఇంకా బాగోలేదని టీడీపీలోకి రావాలనుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో టీడీపీ బలంగా ఉంది. ఒకటి, రెండు చోట్ల తప్ప అభ్యర్థుల సమస్య లేదు. ఒంగోలు ఎంపీ స్థానానికి బాలినేని, మాగుంటల్లో ఒకరు సరిపోతారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మాగుంట నెల్లూరు ఎంపీగా పోటీ చేయించవచ్చని కూడా ఆలోచిస్తున్నారు. చంద్రబాబు విడుదలైన తర్వాత వీరి ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.