ఏపీలో ఒకటో తేదీన ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. అయితే వాలంటర్లతో కాదు. సచివాలయ సిబ్బందితో . ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయించాలని చంద్రబాబు పదే పదే సీఎస్ జవహర్ రెడ్డికి లేఖలు రాశారు. కలెక్టర్లు కూడా పంపిణీ చేయడం పెద్ద సమస్య కాదని చెప్పారు. కానీ జవహర్ రెడ్డి మాత్రం జగన్ రెడ్డి రాజకీయ అజెండాను అమలు చేశారు. ఇప్పుడు వాలంటీర్లతో పని లేకుండా పెన్షన్ల పంపిణీ ఒకటో తేదీన ఉదయమే జరిగిపోతుందని ప్రభుత్వం చూపించబోతోంది.
గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగులు తమ పరిధిలోని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇది సక్సెస్ అయితే వాలంటీర్లకు ఇక పని లేనట్లే. ఎందుకంటే వైసీపీకి పని చేయడం కాకుంా నికరంగా ఉండే పని పెన్షన్లు పంపిణీ చేయడమే. ఈ పని కూడా లేకపోతే ఇక వాలంటీర్లను ఎలా ఉపయోగించుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది.
వాలంటీర్ల భవిష్యత్ ఏమిటన్నదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జీతం పదివేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో సగానికిపైగారాజీనమా చేశారు. వారంతా ఇప్పుడు మళ్లీ తమను తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇంకా వాలంటీర్ల వ్యవస్థపై దృష్టి పెట్టలేదు. ఏదో ఓ నిర్ణయం తీసుకునేవరకూ వాలంటీర్లకు ఎదురు చూపులు తప్పేలా లేవు.