ఉపఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించిన కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికలు నిర్వహించలా లేదా అన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. అయితే అ నిర్ణయం ఏమిటన్నదానిపై సమాచారం బయటకు రాలేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా కరోనా పరిస్థితుల ఆధారంగానే ఉపఎన్నికలు నిర్వహించాలనుకుంటోంది. అందుకే ధర్డ్ వేవ్ గురించి మరిన్ని నివేదికల కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఉపఎన్నికలు రాజకీయంగా అత్యంత కీలకమైనవి. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నవంబర్‌లోపు ఎమ్మెల్యే పదవికి ఎన్నిక కాకపోతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది.
ఈ లక్ష్యంతోనే బీజేపీ కేంద్ర అధికార పార్టీగా ఈసీని ప్రభావితం చేసి ఉపఎన్నికలు నిర్వహించనీయడం లేదని ఆలస్యం చేస్తోందని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. కారణం అదైనా చాలా రోజుల నుంచి ఉపఎన్నికలు పెడింగ్‌లో ఉన్నాయి. మమతా బెనర్జీతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించాలంటే నవంబర్ వరకూ ఎలాంటి ఎన్నిక జరగకూడదు. ఆ తర్వాత జరిగినా పర్వాలేదని బీజేపీ అనుకుంటోంది. ఎందుకంటే మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేస్తారు. అదే కావాలని బీజేపీ కోరుకుంటోంది. కానీ రాజ్యాంగం ప్రకారం ఏ స్థానం అయినా ఖాళీ అయితే ఆరు నెలల్లో పూర్తి చేయాలి. ప్రకారం చాలా ఉపఎన్నికలు పెండింగ్‌లో పడిపోయాయి. ఆరు నెలల గడువు దాటిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దానికి కరోనా కారణం చెప్పడానికి అవకాశం ఉంది.
అందుకే ఈసీ కూడా దిలాసాగా ఉంది. ఓ వైపు బెంగాల్లో ఉపఎన్నిక జరగకూడదని అనుకుంటున్న బీజేపీ.. తెలంగాణలోని హుజురాబాద్‌లో మాత్రం ఎన్నికలు జరగాలని అనుకుంటోంది. ఉపఎన్నిక జరుగుతుందని చెప్పి రాజీనామా ఆమోదించుకునేలా ఈటలపై ఒత్తిడి చేసిన నేతలు ఇప్పటి పరిస్థితిని చూసి హతాశులవుతున్నారు. మొత్తంగా ఉపఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారన్నది తర్వాతి సంగతి.. అసలు ఎన్నికలు పెడతారా లేదా అన్నది పజిల్‌గా మారింది.