ఈరోజు `ఆర్.ఆర్.ఆర్` నుంచి `ఎత్తర జెండా` పాటొచ్చింది. ఆర్.ఆర్.ఆర్ నుంచి చిన్న పోస్టర్ వచ్చినా, టీజర్ వచ్చినా… సోషల్ మీడియాలో అల్లకల్లోలం జరిగిపోతుంది. అలాంటిది.. ఏకంగా వీడియో సాంగే రిలీజ్ చేసేశారు. ఎన్టీఆర్, చరణ్, అలియా.. ముగ్గురూ ఆడి, పాడి… అలరించారు. `పరాయి పాలనపై కాలుదువ్వి, కొమ్ములు విరిచిన కోడె గిత్తల్లాంటి అమర వీరుల్ని తలచుకుంటూ` అంటూ… రాజమౌళి ఈ పాటని విడుదల చేశారు. ప్రాంతాలకు అతీతంగా ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల్ని ఈ పాటలో తలచుకున్నారు. దేశ భక్తి గీతమైనా సరే, మాసీ మాసీగా తీర్చిదిద్దడం బాగుంది. ప్రేమ్ రక్షిత్ కూడా.. అభిమానుల్ని అలరించేలానే స్టెప్పుల్ని కంపోజ్ చేశారు. అయితే ఈ పాట.. సినిమాలో ఉండదని టాక్. కేవలం ప్రమోషన్ కోసమే ఈ పాటని వాడుతున్నారని తెలుస్తోంది. `దోస్తీ` అనే పాటనికూడా ఇది వరకు చిత్రబృందం విడుదల చేసింది. ఆ పాట కూడా.. సినిమాలో ఉండదు. కేవలం ప్రమోషన్‌కి మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు.. ఎత్తర జెండా పాట కూడా అంతే. నిజానికి ముందు ఈ పాట తీసే ఆలోచనే లేదు. సినిమా తయారీకి, విడుదలకు మధ్య కావల్సినంత సమయం ఉండడంతో.. ఈ పాటని కంపోజ్ చేయించినట్టు తెలుస్తోంది.