తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఎన్నికలను రద్దు చేయడమే కాదు.. ఏకంగా 105 మంది అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అయితే ఈ అభ్యర్థులపై ఆ పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు చోట్ల నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సహజంగా.. టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందని చాలా మంది మంది నమ్ముతున్నారు కాబట్టి… ఆ పార్టీ టిక్కెట్ల కోసం.. అధికంగా పోటీ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల్లోనూ అసమ్మతి ఉంటుంది. ఈ అసమ్మతి అనేది.. రాజకీయ పార్టీల ధోరణి వల్ల వస్తోంది. గెలుపు గుర్రాల కోసం ఏ పార్టీ నేతలను అయినా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధపడటం వల్లే.. ఈ పరిస్థితి వస్తోంది.
పార్టీల తీరు వల్లే అసమ్మతి పెరుగుతోందా..?
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పూర్తి స్థాయి మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పార్టీలో కింది స్థాయి నుంచి పని చేసుకుని… వచ్చిన వారికే పార్టీలు టిక్కెట్లు ఇచ్చేవి. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇవాళ టిక్కెట్‌కు అర్హతకు… ఏ పార్టీలో ఉన్నారన్నది పట్టించుకోవడం లేదు… గతంలో తమ పార్టీని విమర్శించారా లేదా అన్నది కూడా పట్టించుకోవడం లేదు.. ఆ పార్టీ నాయకుడ్ని ఘోరంగా విమర్శించినా పట్టించుకోవడం లేదు… ఒక్కటే చూస్తున్నారు.. గెలుస్తాడా..? లేదా..? అన్నది ఒక్కటే అర్హత. ఆ రకమైన వాతావరణంలోకి రాజకీయాల్లోకి వచ్చాయి. పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారాయి. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు అంతే ఉన్నాయి. నాయకుని గెలుపు కోసం.. క్యాడర్ త్యాగాలు చేయాల్సిందే. రాహుల్ గాంధీని గెలిపించుకోవలాంటే.. పార్టీ నేతలు.. త్యాగాలు చేయాల్సిందే. ఇదే పరిస్థితి.. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీల్లోనూ ఉంది. అందుకే చివరి నిమిషంలో… పార్టీ అభ్యర్థులు మారిపోతున్నారు. పలుకుబడి పెరుగుతున్న కొద్దీ.. అసమ్మతి పెరిగిపోతూ ఉంటుంది.
గెలిచే అభ్యర్థులకూ టిక్కెట్లివ్వలేదా..?
ఏ పార్టీలో ఎక్కువ అసమ్మతి ఉంటే.. ఆ పార్టీకి ఎక్కువ డిమాండ్ ఉందని అర్థం. ఏ పార్టీ తరపున గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందో.. ఆ పార్టీ తరపునే పోటీ చేయడానికి ఎక్కువ మంది పోటీ పడతారు. ఆ పార్టీ సహజంగానే అసమ్మతి ఎక్కువగా ఉటుంది. అయితే.. అవకాశాల్ని దెబ్బతీసే అవకాశం ఉంది. గెలవగలిగే అవకాశం ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తే.. గెలవలేని పార్టీ నేతలు… ఆ అభ్యర్థి అవకాశాల్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కానీ గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థులకు టిక్కెట్లివ్వని చోట …నష్టపోతారు. ఇదంతా.. నియోజకవర్గానికే పరిమితమవుతంది. అసమ్మతి వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం ఉండదు. ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు మాత్రమే మారుతాయి. ఆ నియోజకవర్గంలో… కాస్తంత బలమైన నాయకుడు.. వేరే పార్టీలోకి పోయినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఓట్లు చీలిపోతూంటాయి. ఆ ఓట్లు ఆ పార్టీకి మైనస్ అవుతాయి. అందుకే అలాంటి వారికి పదవులు ఎర వేసి బుజ్జగిస్తూ ఉంటారు. తిరుగుబాటు ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు టీఆర్ఎస్లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నష్టం పోవడానికి కేసీఆర్.. వేసిననటువంటి ఎత్తుగడ ఏమిటంటే.. తనకు ఓటు వేయమని అడుగుతున్నారు. కేసీఆర్ ఈ ఎన్నికలను రిఫరెండంగా మార్చారు. తన పాలనకు ఓటు వేయమంటున్నారు.
అసమ్మతి పెరగకుండా టిక్కెట్లు ప్రకటించారా..?
ప్రస్తుత పరిస్థితుల్లో అసంతృప్తిని చల్లబరిచేందుకు కేసీఆర్ పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. నేను ఏమనుకుటున్నానంటే.. చివరి క్షణంలో అయినా …ఇరవై మంది అభ్యర్థుల్ని మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో ఇద్దరు తప్ప అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఒక్కసారిగే.. 20 మందికో… 30 మందికో టిక్కెట్ ఇవ్వకపోతే.. ఒక్కసారిగా.. ఆందోళన ఉద్ధృతంగా సాగుతుంది. ఇతర పార్టీ నేతలు.. పెద్దగా స్పందించినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానీ.. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వంపై విమర్శలు చేసి.. పార్టీకి రాజీనామా చేసి వెళ్తే అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలా మూకుమ్మడిగా.. 20, 30 మంది చేస్తే చాలా సమస్య అవుతుంది. కొంత మందికి టీఆర్ఎస్లోని ముఖ్య నేతలే సాయం చేస్తూంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా.. కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. చివరి క్షణంలో.. 15 మందిని కానీ.. 50 మందిని కాని.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కానీ… ప్రకటించిన అభ్యర్థుల్ని కానీ మార్చే అవకాశం ఉంది.
చివరి క్షణాల్లో 20మందిని మార్చేస్తారా..?
ముఖ్యంగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలల్లో… బీఫాం ఇచ్చే రోజు.. 20 మందిని మార్చే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే చివరి క్షణంలో ఏమీ చేయలేరు. వేరే పార్టీలతో మంతనాలు జరుపుకోలేరు. టీఆర్ఎస్ పై తిరుగుబాటు చేయలేరు. ఎందుకంటే.. వారికి అంత సమయం ఉండదు. పైగా కేసీఆర్ మార్చే అభ్యర్థులు కూడా.. పార్టీలోనో.. ప్రజల్లోనో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న వాళ్లే ఉంటారు. అలాంటి వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం కూడా కష్టమే. చేసినా.. టీఆర్ఎస్ ను దెబ్బతీయడం మరీ కష్టమే. అందుకే కేసీఆర్ ఒకేసారి.. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లుస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్ ఇచ్చి మార్చారనే విమర్శలు రాకుండా.. వారిపై ఉన్న వ్యతిరేకతను ముందుకు తీసుకు రావొచ్చు. అందు వల్ల నామినేషన్ల సమయానికి 20 మంది అభ్యర్థుల్ని కేసీఆర్ మార్చడానికే ఎక్కువ అవకాశం ఉంది.