సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో ఓటమి తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆయన హయాంలో కాంగ్రెస్‌కు లభించిన విజయాలేం లేవు. అందుకే.. హైకమాండ్ కూడా కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేసుకునే ప్రక్రియ పూర్తి చేసింది. కానీ తెలంగాణ నేతల్లో ఐక్యత లేకపోవడంతో ఆ ప్రకటన ఎప్పటికప్పుడు వాయిదా వేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మారిస్తే.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని లాక్కోవడానికి బీజేపీ, టీఆర్ఎస్ రెడీగా ఉన్నాయి. అందుకే… కాంగ్రెస్ హైకమాండ్ కిందా మీదా పడుతోంది. ఈ సమయంలో… ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మరో చాన్స్ వచ్చింది. అదే దుబ్బాక ఉపఎన్నిక.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి అనుచరులుగా పేరు పొందిన కొంత మంది నేతలు ఇటీవలి కాలంలో ఓ డిమాండ్ వినిపిస్తున్నారు. అదేమిటంటే.. పీసీసీ అధ్యక్షుడ్ని ఇప్పుడే మార్చవద్దని.. దుబ్బాక ఎన్నికలు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయే వరకూ ఆగాలాని కోరుతున్నారు. అంతకు ముందు జగ్గారెడ్డి లాంటి నేతలు ఉత్తమ్‌నే పీసీసీ చీఫ్‌గా కొనసాగించాలని లేకపోతే.. తనకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ను వినిపిస్తూ వస్తున్నారు. అంటే.. ఉత్తమ్ వర్గం.. దుబ్బాకలో గెలిచి..తాము గెలుపు అందించగల స్థితిలో ఉన్నామని నిరూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
దుబ్బాక ఎన్నికను ఉత్తమ్ సీరియస్‌గా తీసుకున్నారు. స్వయంగా దుబ్బాక మండలానికి తానే బాధ్యుడిగా ఉంటున్నారు. తనకు సన్నిహితులైన ఇతర నేతలకు ఇతర మండలాల బాధ్యతలు ఇచ్చారు. అభ్యర్థిని కూడా తానే ఎంపిక చేశారు. నర్సారెడ్డిని అభ్యర్థిగా నిర్ణయిస్తూ.. పేరును హైకమాండ్‌కు పంపారు. ఒక్క పేరే పంపారు కాబట్టి.. ఖారరయ్యే అవకాశం ఉంది. ఇతర ముఖ్య నేతలు.. ఈ ఎన్నికల్లో యాక్టివ్‌గా ప్రచారంలో పాల్గొన్నా.. వ్యూహాలు.. ఇతర వ్యవహారాల్ని మొత్తం.. ఉత్తమ్‌కే వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఓ రకంగా ఉత్తమ్‌కు దుబ్బాక ఉపఎన్నిక అగ్నిపరీక్షగా మారిందని చెప్పుకోవాలి. ఒక్కడ గెలిస్తే మాత్రం ఉత్తమ్ దేశ తిరిగే అవకాశం ఉంది. ఓడిపోతే కొత్త పీసీసీ చీఫ్‌కు బాధ్యతలు అప్పగించడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేసే అవసరం ఉండకపోవచ్చు.