వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మాది తెనాలే… ప్రభుత్వానిది తెనాలేనని సమీకరణం చూపి… అన్నీ చేపించేస్తానని హామీలు ఇచ్చి ఏకగ్రీవంగా సచివాలయ ఉద్ోగ సంఘం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికి మూడేళ్లయిపోయింది. ఆయన పదవీ కాలం ముగిసిపోయింది. ఇంకా మా ప్రభుత్వమే ఉందని.. ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన కనీసం ఓ ప్రతిపాదన కూడా పెట్టలేకపోయారు. ఎందుకంటే..ఉద్యోగులుక ఆయన చేసిన మేలు కంటే కీడే ఎక్కువ. ఇప్పుడు ఎన్నిక జరుగుతోంది. ఆయన కు పోటీగా రామకృష్ణ అనే మరో ఉద్యోగ నేత నిలబడ్డారు.
వెంకట్రామిరెడ్డికి ఇప్పుడు మూడేళ్లలో ఫలానా మంచి చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. పైగా పీఆర్సీ, ఇళ్ల స్థలాలు, సేవింగ్స్ కూడా మంజూరు చేయకపోవడం. లీవులు.. పని ఒత్తిడి ఇలా ఎన్నో సమస్యను తెచ్చి నెత్తి మదీ పెట్టారు. పదవిని ఉపయోగించుకుని ప్రభుత్వం వద్ద పలుకుబడి తెచ్చుకుని రాజకీయ భవిష్యత్ చూసుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికీ వెంకట్రామిరెడ్డి దాన్నే అస్త్రంగా చేసుకున్నారు. ప్రభుత్వం మాది కాబట్టి..మేలు చేస్తానని.. తననే ఎన్నుకోవాలని అడుగుతున్నారు.
ఇటీవల అధ్యక్ష పదవికి కాకుండా ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. పదవిని నిలుపుకునేందుకు సచివాలయ ఉద్యోగుల్లో కాస్త పలుకుబడి ఉన్న ప్రతీ వారిపై పై స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వైసీపీ మార్క్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంటున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది బుధవారం తేలనుంది. 21నే ఎన్నికలు జరగనున్నాయి.