మాజీ మంత్రి విడుదల రజిని వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారా..? ఇంకా వైసీపీలోనే కొనసాగితే ఇబ్బందులు ఎదురు అవుతాయని భావించే వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి విడదల రజిని వైసీపీని వీడుతారని విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడోద్దని రజినికి సర్దిచేప్పెందుకు జగన్, సజ్జల ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీని వీడాలని తుది నిర్ణయం తీసుకోవడంతోనే జగన్ తో సైతం మాట్లాడేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపలేదని తెలుస్తోంది.
మాజీ మంత్రి రజినిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని ఉపయోగించుకొని అవినీతికి పాల్పడ్డారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై చిలకలూరిపేట ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారని… వాటిపై విచారణ జరిపేలా ప్రభుత్వాన్ని కోరనున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో భవిష్యత్ పరిణామాలను అంచనా వేసే బీజేపీలో చేరేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది.
అయితే, కూటమి సర్కార్ లో బీజేపీ భాగస్వామిగా ఉండటంతో విడదల రజిని చేరిక విషయంపై టీడీపీ అభ్యంతరం చెప్పే అవకాశం లేకపోలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను చేర్చుకోవద్దని సూచించే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని అంచనా వేసే పార్టీ మార్పుపై బీజేపీ నేతలతో రజిని అంతర్గతంగా చర్చిస్తున్నారని అంటున్నారు.