చార్టెడ్ అకౌంటెంట్ల వృత్తికి విజయసాయి రెడ్డి మచ్చ తెచ్చారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తేల్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. దీనికి కారణం ఆయన సీఏ వృత్తిని అగౌరవ పరుస్తూ అక్రమ, చట్ట విరుద్ధ మార్గాల్లో బెదిరింపులకు పాల్పడి.. సన్నిహిత సంస్ధల్లో పెట్టుబడులు పెట్టించడమే. ఈ అంశంపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో .. చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. ఆయనను సీఏగా సస్పెండ్ చేసే్ అవకాశాలు ఉన్నాయి.
అయితే విజయసాయిరెడ్డి హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తనపై ఐసీఏఐ చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారు . హైకోర్టులో ఇప్పుడా పిటిషన్ పై విచారణ జరగబోతోంది. తనపై అక్రమాస్తుల కేసులలో విచారణ జరగకుండా అడ్డుకుంటున్న విజయసాయిరెడ్డి అందు కోసం కొత్త కొత్త పిటిషన్ల వ్యూహాలనే అమలు చేస్తున్నారు. ఎంత కాలం ఆపగలరని.. ఎప్పటికైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.
చార్టెట్ అకౌంటెండ్ గా విజయసాయిరెడ్డి తన వృత్తికే కళంకం తేవడం కాకండా… ఇతర సంస్థల్ని కూడా తప్పులు చేసేలా ప్రోత్సహించారు. డెలాయిట్ అనే సంస్థతోనే తప్పుడు ఎస్టిమేషన్లు ఇప్పించి కేసుల్లో ఇరుక్కునేలా చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో విన్యాసాలు చేశారు. ఆయన ఇప్పుడు శరత్ అసోసియేట్స్ అనే కంపెనీని కూడా కష్టాల్లోకి నెట్టారు. స్కిల్ కేసులో ఆ కంపెనీ ఇచ్చిన ఆడిట్ రిపోర్టుపై నా ఐసీఏఓలో పిటిషన్ దాఖలైంది. విచారణ జరుగుతోంది .