విజయసాయిరెడ్డి.. ఉన్నత చదువు. చూడటానికి సంస్కారిలా ఉంటారు. కానీ వైఎస్ కుటుంబ నీడలో పెరిగాడో లేకపోతే రఘురామకృష్ణరాజు బయట పెట్టిన ఆ కుటుంబ చరిత్ర ప్రకారం ఆయన తండ్రి జైల్లో ఉండగా పుట్టిన చరిత్ర ఉన్న ఫ్యామిలీ నేపధ్యం ఏమో కానీ ఎప్పుడూ గౌరవించాలనే రాజకీయాలు చేయలేదు. వైఎస్ బతికున్నంత కాలం వారు సంపాదించిన అక్రమాస్తులను వైట్ చేసేలా సూట్ కేసు కంపెనీలు పెట్టేందుకు .. ఆ డబ్బును హవాలా చేసేందుకు తన సమయం అంతా వెచ్చించారు. ఆయన పోయిన తరవాత కేసుల పాలై.. రాజకీయాల్లోకి వచ్చారు.
అంతకు ముందు ఆయన గురించి ఆయనతో పని చేసిన వారికి తెలుసు. ఆర్థిక వ్యవహారాలు నడిపిన వారికి తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఎంత వికృతమైన వ్యక్తో అందరికీ తెలిసింది. పప్పు నాయుడు.. తుప్పు నాయుడు అని అనడమే కాదు. అక్రమ సంబంధాలు అంటగట్టడానికి వెనుకాడలేదు. ఆయన పాత ట్వీట్లు చూస్తే.. ఇతను ప్రజాజీవితంలో ఎలా ఉన్నాడని అనుకుంటారు.ఇది కేవలం వ్యక్తిత్వం ..బయటకు కనిపించేది.
కానీ అసలు క్రూరత్వం .. నరనరాన జీర్ణించుకున్న డబ్బు పిచ్చి అందరికీ తెలుసు. తన కుమార్తెను అరబిందో కంపెనీకి చెందిన వ్యవస్థాపకుల్లో ఒకరి ఇంటికి కోడలికి పంపించి.. ఆ కుటుంబాన్ని బినామీగా మార్చి చేయాల్సినదంతా చేశారు. విజయసాయిరెడ్డి చేసిన దందాల గురించి.. ఆయన చేసిన మాఫియా రాజ్యం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ. బయటకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. విశాఖపట్నంలో కూర్చుని .. దావుద్ స్థాయిలో ఆయన భూమాఫియా నడిపారంటే.. ప్రతి శుక్రవారం బుల్డోజర్లతో బయలుదేరి ఆస్తులు రాయించుకునేవారంటే మామూలు విషయం కాదు.
అధికారం వచ్చిందని టీడీపీ నేతల్ని ఆయన వేధించిటన్లుగా ఎవరూ వేధించి ఉండరు. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ఆయనే కారణం. తవ్వితే తెలుగుదేశం నేతలకే ఆయన ఘనకార్యాలు ఎక్కువగా తెలుసు. ఇప్పుడు ఆయన పీకల దాకా ఇరుక్కుపోయారు కాబట్టి తెల్లజెండా ఎగరేశారు. చెతులెత్తేసి నేను పొలం పనులు చేసుకుంటా వదిలేయండి.. అంటున్నారు. వదిలేస్తారా ?