విజయసాయిరెడ్డి విదేశాలకు పోతానని సీబీఐ కోర్టులో అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. నార్వేతో పాటు ఫ్రాన్స్ టూర్ కు అనుమతి ఇవ్వాలని కోర్టులో దాఖలు చేశారు. ఆ రెండుదేశాలకే ఎందుకు వెళ్తున్నారన్నది కీలకంగా మారింది. జగన్ రెడ్డి లండన్ లో ఇరవై రోజుల పాటు వ్యవహారాలు చక్కబెట్టి వస్తున్నారు . ఆ తర్వాత విజయసాయిరెడ్డి వెళ్లి వాటికి సంబంధించిన లావాదేవీలు పూర్తి చేసేందుకు వెళ్తున్నారని అనుకోవచ్చు.
విజయసాయిరెడ్డిపై గతంలో కేసులు కాదు.. కాకినాడ పోర్టు కేసులో ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నాయి. కోర్టులో ఉన్న కేసుల్లో ఉన్న బెయిల్ షరతుల మీద ఆయనకు కోర్టు అనుమతి ఇస్తే పాస్ పోర్టు ఇస్తారు కానీ.. వేరే కేసుల్లో లుకౌట్ నోటీసులు ఉంటే విదేశాలకు పోనీయరు. అంటే కోర్టు పర్మిషన్ ఇచ్చినా విజయసాయిరెడ్డి బయటకు పోవడం అంత తేలిక కాదు. కానీ ఆయన రాజీనామా చేశారు. నేడో రేపో ఆయన మాజీ ఎంపీ అవుతారు. అప్పుడు ఆయనకు కనీస ప్రోటోకాల్ కూడా ఉండదు.
విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్తే తిరిగి వస్తారా లేదా అన్న సందేహం చాలా మందికి ఉంది. ముందుగా అక్కడకు వెళ్లి కనిపించకుండా పోవడానికి ..అక్కడ ఏర్పాట్లు చేసుకుని ఉంటారన్న అనుమానాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. నార్వేతో పాటు ఫ్రాన్స్ లో స్థిరపడటానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఉంటారని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే..వి.సా.రెడ్డి చేసిన పనులకు మరోసారి ఆయన జైలుకెళ్లడం ఖాయమని.. ఈ సారి బయటకు రాలేరన్న వాదన వినిపిస్తోంది. పారిపోకుండా చూడాల్సింది వ్యవస్థలే.