రాయలసీమలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీ వివేకం సినిమా తమ ఆశలకు గండికొడుతుందని ఆందోళన చెందుతోంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని సొంత కుటుంబ సభ్యులే జగన్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇది జగన్ కు పెద్ద తలనొప్పిగా మారగా.. వివేకం సినిమా వీక్షణలు సీమలో ఓటు బ్యాంక్ పై ఏమైనా ప్రభావం చూపుతుందా అని వైసీపీని కలవరపెడుతోంది.
వివేకం సినిమా యూట్యూబ్ లో విడుదల కావడంతో రెండు కోట్లకు పైగా జనాలు వీక్షించడం సంచలనం రేపుతోంది. విదేశాల్లో ఉన్న ఏపీ వాసులు కూడా ఈసినిమాను తిలకించారు. ఈ సినిమా విశేష ఆదరణ పొందటం వైసీపీ సీమ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ సినిమా ప్రభావం ఏపీలో ముఖ్యంగా సీమలో ఎలా ఉండనుందని అప్పుడే చర్చలు మొదలు పెట్టేశారు.
రాయలసీమలో వైసీపీకి ఓట్ల శాతం తగ్గితే మాత్రం అది షర్మిల,సునీత చేస్తోన్న పోరాటంతోపాటు వివేకం సినిమా ఇంపాక్ట్ అని కూడా అనుకోవచ్చు. అయితే, ఏపీలో అధికారంపై వైసీపీకి ఆశలు సన్నగిల్లుతున్నాయి. సీమలో మెజార్టీ సీట్లు దక్కితే మిగతా ప్రాంతాల్లో కొంచెం అటు, ఇటుగా సీట్లు వచ్చినా అధికారానికి డోకా ఉండదని అధిష్టానం భావిస్తోన్నా.. వివేకం సినిమా ఏం చేస్తుందోనని ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది.
వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దని కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోంది.