ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రశ్నే లేదని పదే పదే ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలే రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కానీ ఏపీ పర్యటనలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓ వైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. వామపక్షాలు పోరాటం చేస్తున్నాయి. కానీ ప్రధాని మాత్రం స్పందించలేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రులకు సెంటిమెంట్ ఉండదన్నట్లుగా ప్రధాని మోదీ వ్యవహారం ఉంది. ప్రజలకేమో కానీ..వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని ఎలాగైనా అడ్డుకుని తీరుతామని.. వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి అన్ని పార్టీలు ప్రకటించాయి. తీరా మోదీ ఏపీకి వచ్చిన తర్వాత ఒక్కరూ నోరు మెదపలేదు.. సరి కదా వైసీపీ అయితే్ కోట్లు ఖర్చు పెట్టుకుని గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు… తాము పోరాటానికి మద్దతిస్తే ఆహ్వానించలేదని.. వైసీపీ నేతల వెంటనే తిరిగారన్న కారణంగా టీడీపీ నేతలు కూడా వారు పిలిచినప్పుడే మద్దతిస్తున్నారు. ఇక జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పారో లేదో స్పష్టత లేదు. మొత్తంగా … తెలంగాణలో సింగరేణికి ఉన్నంత సెంటిమెంట్… ఏపీలో విశాఖకు లేదని మోదీ మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది.