పుంగనూరు నుంచి ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రయాదవ్ కొత్త పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ . ఈ పార్టీ పేరు కూడా పెద్దగా ఎవరికీ నోటీస్ కాలేదు. కానీ వైసీపీ నాయకుల్ని మాత్రం భయపెడుతోంది. గుంటూరులో ఓ బహిరగసభ ద్వారా పార్టీ ప్రకటించిన రామచంద్ర యాదవ్… తొలి సారి తిరుపతి ఎయిర్ పోర్టుకు వచ్చారు. తన స్థాయిలో ఆయన స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. అయితే ఆయనకు అడుగడుగునా పోలీసులుస అడ్డంకులు కల్పించారు. కాన్వాయ్ కు అనుమతి లేదని.. మరొకటని.. అటూ ఇటూ తిప్పి.. పుంగనూరుకు వెళ్లేలా చేశారు.
పోలీసుల తీరు చూసి ఓ సందర్భంలో రామచంద్రయాదవ్ రోడ్డుపైనే ధర్నాకు దిగారు. రామచంద్రయాదవ్ పార్టీని చూసీ వైసీపీ ఎందుకు కంగారు పడుతోందని ఇంత భయం ఎందుకన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. పుంగనూరులో తాను పాతుకుపోయానని పెద్దిరడె్డి అనుకుంటున్నారు కానీ.. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఆయన పూర్తిగా దొంగ ఓట్లమీద ఆధారపడి గెలుస్తున్నారన్న అనుమానాలు ఇటీవల పెరిగిపోయాయి. నియోజకవర్గంలో తనను ఎదురించే నాయకులపై దాడులు చేయడం… ఇళ్ల ను ధ్వంసం చేయడమే ఆయన రాజకీయం. రామచంద్ర యాదవ్ ఇంటిపైనా దాడి చేశారు. టీడీపీ తరపున ఉన్న చల్లా బాబు అనే నేత కూడా చురుగ్గా తిరుగుతున్నారు. దీంతో పుంగనూరులో పెద్దిరెడ్డికి గండం ఉందన్న అభిప్రాయం ఊపందుకుంది.
ఇంత కాలం భయ పెట్టి పెద్దిరెడ్డి ఓట్లు పొందుతున్నారని ఇప్పుడు ఆయనను చూసి భయపడేవారు లేకపోవడం..ఎంత దాడులు చేసినా తిరగబడుతూండటంతో ఆయన పరపతి కరిగిపోతోంది. అందుకే మరింత అసహనానికి లోనై రామచంద్రయాదవ్ ను కనీసం ర్యాలీలు చేయడానికి.. కాన్వాయ్ గా వెళ్లడానికి కూడా ఆటంకాలు సృష్టిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.