పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలు, చేస్తున్న పోరాటం వైసీపీ నాయకుల్ని వణికిపోయేలా చేస్తోంది. ఎంతగా అంటే.. రోజు అంతా ఆమెను టార్గెట్ చేస్తున్నారు. విజయసాయిరెడ్డితో పాటు రోజా, కొడాలి నాని ఇలా అందర్నీ రంగంలోకి దించుతున్నారు. ఆమెను సైలెంట్ చేసేందుకు ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి గుండె దడ అసలు తగ్గుతున్నట్లుగా లేదు. విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని నేరుగా సీజేఐకి లేఖ రాయడమే కాదు.. నేడో రోపే సీబీఐ కోర్టులోనూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవడంతో.. విజయసాయిరెడ్డి ఆమెపై ఇష్టారీతిన వాగుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవచ్చు కదా అని ఇష్టం వచ్చినట్లుగా అమర్యాదకరమైన భాషతో ఇష్టం వచ్చినట్లుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తూంటే పురందేశ్వరి మీద ఆయనకు భయంతో కూడిన కోపం వచ్చిందని ఎవరికైనా అర్థమవుతతుంది. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా .. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయడం సహజం. దానికి చేతనైతే అధికార పార్టీగా ఆధారాలతో సమాధానం ఇవ్వాలి. అంతే కానీ.. వ్యక్తిగత, కుటుంబ విషయాలతో దాడి చేయడం అంటే.. మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమెను సైలెంట్ చేయాలని ప్రయత్నం చేయడమే. ఇతర నేతల్ని రంగంలోకి దించారు.
రోజా.. కొడాలి నాని వంటి నోరు అదుపు ఉండని నేతలు పురందేశ్వరిపై విరుచుకుపడుతున్నారు. పురందేశ్వరి బయట పెడుతున్న అంశాలు.. లేవనెత్తుతున్న విషయాలను చూసి.. అవి ముందుకు వెళ్తే తాము ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని వైసీపీ నేతలకు కంగారెక్కు అయిపోయి విమర్శలు చేస్తున్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిపై పోరాటం పురందేశ్వరి ఆపేది ఉండదని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.