వైసీపీ నేతలకు చెప్పుకోలేనన్ని సమస్యలు ఉన్నాయి. తన కుటుంబంపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తూంటే.. మంత్రులు సైలెంట్‌గా ఉన్నారని జగన్ ఫైర్ అయ్యారు. ఆ వెంటనే టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా అవే ఆరోపణలు బీజేపీ నేతలు కూడా చేస్తున్నారు. ఇటీవల ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ ప్రభుత్వ పెద్దలున్నారని మొత్తం బయటకు వస్తాయని ప్రకటించారు. అలాగే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రెడ్డి నేరుగా విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధం ఉందని ప్రకటించారు. సోము వీర్రాజు లాంటి నేతలు కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.
అయితే ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత కూడా ఈ ఆరోపణలను ఖండించడం లేదు. బీజేపీ నేతలపై పల్లెత్తు మాట అనడం లేదు. సాధారణంగా ఇలాంటి ఆరోపణలు బీజేపీ నేతలు చేసినా ఖండించారు. కానీ వారు చేస్తే పర్వాలేదు టీడీపీ నేతలు మాత్రం చేయకూడదన్నట్లుగా పరిస్థితి ఉంది. బీజేపీ నేతలు చేసే ఆరోపమలే సీరియస్. ఎందుకంటే కేంద్రం వారి చేతుల్లో ఉంది. వారి వద్దపక్కా సమాచారం ఉంటేనే ఆరోపణలు చేస్తారు. ఉత్తినే ఆరోపణలు చేస్తే కేంద్రంలో ఉన్నది మీరే కదా అని కౌంటర్ ఇస్తారు.
అందుకేనేమో కానీ వైసీపీ నేతలు బీజేపీ వాళ్లకు కౌంటర్ ఇవ్వడం లేదు. టీడీపీ నేతలపై మాత్రం బూతులతో విరుచుకుపడుతున్నారు. టీడీపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి.. దమ్ముంటే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలకు మాత్రం నోట మాట రావడం లేదు.